భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, పేదలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగల ప్రణయ్‌రాజ్, మండల నాయకులు గంధం సతీష్, యువజన నాయకుడు పిట్టల రాంబాబు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Post A Comment: