జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మడే సమ్మక్క దశదిన కర్మలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మడే సంతోష్ నానమ్మ మడే సమ్మక్క కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. పార్టీ కోసం క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తున్న మడే సంతోష్ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్‌లోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
నాగారం టీఆర్‌పీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చిడం ధర్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు గండు కరుణాకర్, పిట్టల వెంకటేష్, మోటపోతుల సమ్మయ్య, జిల్లా కోశాధికారి జినుకల శ్రీను, వ్యవసాయ విభాగం అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, కార్మిక విభాగం అధ్యక్షుడు, భూపాలపల్లి మండల అధ్యక్షుడు మీసాల రాజు, మనోహర్రావు మండల అధ్యక్షుడు మేనం సంతోష్, నాగారం గ్రామ కమిటీ నాయకులు, టీఆర్‌పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: