కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వార్డు సభ్యుడు వేల్పుల రాజమల్లు, దేవక్కలను కాంగ్రెస్ నాయకులు గురువారం పరామర్శించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. వికలాంగుల పింఛన్‌తో పాటు బీమా సౌకర్యం కల్పించేలా సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, శంకరంపల్లి సర్పంచ్, మండల ఫోరం అధ్యక్షుడు అజ్మీర కిషన్‌నాయక్, సీనియర్ నాయకులు నవీన్‌రావు, పాగే సురేష్, కోడిపెల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: