కాటారం: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గద్దె సమ్మిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అంగోత్ సుగుణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల, వైస్ చైర్మన్ చిన్నాల బ్రహ్మారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, మంథని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అజ్మీర కిషన్ నాయక్, కాటారం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టూరి మహేష్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: