కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విస్తృతంగా పర్యటించారు. కాటారం మండలంలోని చింతకాని బీట్, చింతకాని సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటవీ సంరక్షణ చర్యలు, అటవీ ప్రాంతాల పరిస్థితి, వన్యప్రాణుల రక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ తదితర అంశాలపై పరిశీలన చేపట్టారు. కాళేశ్వరం జోన్ పరిధిలో అటవీ సంరక్షణకు చేపడుతున్న చర్యలను అధికారులు పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, గస్తీ నిర్వహణపై సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. అటవీ సంపదకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై సమీక్షించారు. ఈ పర్యటనలో కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ ప్రభాకర్, ఐఎఫ్‌ఎస్ కిష్టగౌడ్, ఐఎఫ్‌ఎస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారి సందీప్ రెడ్డి, మహదేవ్‌పూర్ డివిజన్ అటవీ రేంజ్ అధికారి స్వాతి, కాటారం డీవైఆర్‌ఓ హెచ్. సురేందర్ నాయక్, యమన్‌పల్లి డీవైఆర్‌ఓ ఝాన్సీ రాణి, చింతకాని సెక్షన్ అటవీ సెక్షన్ అధికారి సోనీ కిరణ్, దామెరకుంట సెక్షన్ అటవీ సెక్షన్ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే కాటారం, దొబ్బలపాడు పరిధి అటవీ బీట్ అధికారి ఎం. రాజేందర్, యమన్‌పల్లి అటవీ బీట్ అధికారి కోట సంజీవ్, యమన్‌పల్లి వెస్ట్ అటవీ బీట్ అధికారి హరీష్, ఇతర అటవీ సిబ్బంది, డ్రైవర్లు మహమూద్, రహీం, గౌస్‌తో పాటు బేస్ క్యాంప్ వాచర్లు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ సంపద పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు చోటుచేసుకోకుండా క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అటవీ రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని అధికారులు సూచించినట్లు సమాచారం. కాటారం రేంజ్ పరిధిలోని చింతకాని బీట్, చింతకాని సెక్షన్ ప్రాంతాల్లో అధికారుల పర్యటనతో క్షేత్రస్థాయిలో అటవీ సంరక్షణ చర్యలపై మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


Post A Comment: