కాటారం, సెప్టెంబర్ 9: తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు తెలంగాణ సమాజం కోసం చేసిన సాహిత్య, సామాజిక సేవలను స్మరించుకున్నారు. తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంలో కాళోజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ సామాన్యుల గొంతుకగా నిలిచిన ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలు, ప్రజా చైతన్య స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. కాళోజీ రచనలు, సాహిత్య సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు ఎం. శ్రీధర్ బాబు, సీనియర్ సహాయకులు, టైపిస్ట్, వీఆర్‌బీఆర్‌ఏఎం సిబ్బందితో పాటు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొని కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: