September 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల ఆవరణలో డీటీఎఫ్ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో గురుకుల విద్యార్థుల సౌకర్యార్థం 8 వీధిలైట్లను పంపిణీ చేశారు. జిల్లా శాఖ సహకారంతో పేరు వెల్లడించేందుకు ఇష్టపడని దాత ద్వారా వీటిని అందించారు.

ఈ పాఠశాలల పరిసర ప్రాంతంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల, బాలుర పాఠశాలలు, కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 2,500 నుంచి 3,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 60 నుంచి 70 మంది వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో పాఠశాలల ఆవరణ సమీపంలోని రహదారిపై వీధిలైట్లు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుక్కల బెడదతో పాటు పాములు, తేళ్ల సంచారం వల్ల భయాందోళనకు గురవుతున్న పరిస్థితిని గుర్తించిన డీటీఎఫ్ ఈ సమస్య పరిష్కారానికి వీధిలైట్లు ఏర్పాటు చేసింది.


ఈ సందర్భంగా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. డీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ.. డీటీఎఫ్ నాటి నుంచి నేటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.

డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను సందర్శించిన సమయంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలను గుర్తించామన్నారు. వాటి పరిష్కారానికి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వృత్తిపట్ల నిబద్ధతతో పాటు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.


కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సడవలి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, మహాదేవపూర్ సింగిల్ విండో చైర్మన్ చల్ల తిరుపతి, కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు లక్ష్మణ్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, డీటీఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు జె. కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు బి. తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి డీటీఎఫ్ మండల అధ్యక్షుడు రాజు నాయక్, మండల ప్రధాన కార్యదర్శి మోహన్ అధ్యక్షత వహించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయం కాటారంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయిలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మొత్తం 15 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులకు సమర్పించారు. మొత్తం నాలుగు దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

వాటిలో రెండు దరఖాస్తులు రెవెన్యూ శాఖకు, ఒక దరఖాస్తు ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు, మరో దరఖాస్తు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినవిగా అధికారులు వెల్లడించారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపనున్నట్లు ఎంపీడీవో అడ్డూరి బాబు తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పిస్తున్నామని, అందిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్, సెప్టెంబర్ 28: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కుల ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు అయితే బాపు మాట్లాడుతూ.. భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత విప్లవ యోధుడని అన్నారు. దేశం కోసం ఆయన ప్రదర్శించిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాకుండా సమాజంలో నెలకొన్న అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని నేటి తరం యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

యువత విద్యతో పాటు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పీక కిరణ్ మౌర్య సూచించారు. సమాజంలోని సమస్యలపై అవగాహన పెంచుకుని, ప్రజల హక్కులు మరియు సామాజిక బాధ్యతల పట్ల చైతన్యంతో వ్యవహరించాలని అన్నారు. భగత్ సింగ్ జీవితం, ఆయన త్యాగం, దేశభక్తి, పోరాట పటిమ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

రజక సంఘం నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, సమానత్వ భావనలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అన్నారం సర్పంచ్ నీళ్ల ప్రభాకర్, రజక సంఘం మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి నరేష్, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు బుర్రి శివరాజు, రజక సంఘం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్‌టీయూ టీఎస్) కాటారం మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–2028 సంవత్సరానికి సంబంధించి మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికల కార్యక్రమానికి పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు రేగూరి శుభాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మండల అధ్యక్షుడిగా అనపర్తి తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా అజ్మీరా రవీందర్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా పి.సంజీవ్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా డి.శారద, ఉపాధ్యక్షుడిగా టి.సంపత్, మహిళా ఉపాధ్యక్షురాలిగా కె.పద్మజ, కోశాధికారిగా ఎస్.సతీష్, కార్యదర్శిగా ఎ.యుగాంధర్ బాధ్యతలు స్వీకరించారు. మహిళా కార్యదర్శులుగా జె.శశిరేఖ, బి.ఈశ్వరి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు అనపర్తి తిరుపతి, ప్రధాన కార్యదర్శి అజ్మీరా రవీందర్ మాట్లాడుతూ తమపై విశ్వాసంతో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రతి ఉపాధ్యాయ సోదర, సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను సంఘం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం తరఫున నిరంతరం పనిచేస్తామని తెలిపారు.

మండలంలోని ఉపాధ్యాయులందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఐక్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాటారం మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, పీఆర్‌టీయూ టీఎస్ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా  తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు ఊపిరిపోసి, బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, స్వరాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యతనిచ్చిన ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల అభ్యున్నతికి బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రవి పటేల్ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గంలో పయనించడమే బాపూజీకి అందించే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాలేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) జిల్లా కార్యదర్శి బందు సుజాత డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న ఆహారం, మెనూ అమలు, తాగునీరు, బాత్రూమ్‌లు, ఇతర మౌలిక వసతులపై పలు సమస్యలు ఉన్నాయని ఆరోపిస్తూ కలెక్టర్, డీటీడీవోకు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకు తగిన చర్యలు కనిపించలేదని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బందు సుజాత మాట్లాడుతూ.. గత కొద్ది నెలలుగా పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, విద్యార్థులకు అందాల్సిన పౌషకాహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థులకు ఏ రోజు ఏ ఆహారం అందించాలి, మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా లేదా అనే విషయాల్లో స్పష్టత లేకుండా పోయిందని అన్నారు. కొంతమంది విద్యార్థులను తమకు అనుకూలంగా మార్చుకుని, అధికారులు లేదా ఇతరులు వచ్చిన సమయంలో తమకు అనుకూలంగా మాట్లాడేలా ఒక గ్రూపును తయారు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.

మౌలిక వసతులపై కూడా ప్రశ్నలు.

పాఠశాలలోని ల్యాబ్‌ను వినియోగించకుండా పూజా గదిగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయని సుజాత పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల వార్డెన్ నిర్లక్ష్యంగా, కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలలోని వాటర్ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడంతో విద్యార్థులు మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. బాత్రూమ్‌లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

విచారణ జరిగిందా? నివేదిక ఏమైంది?

కలెక్టర్, డీటీడీవోకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు? పాఠశాలలో వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారా? మెనూ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, ఆహార పదార్థాల కొనుగోలు వివరాలు, విద్యార్థులకు అందించిన భోజనాన్ని పరిశీలించారా? మౌలిక వసతులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నివేదిక రూపొందించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఫిర్యాదులు వచ్చినప్పుడు కేవలం విచారణ పేరుతో సరిపెట్టకుండా, వాస్తవ పరిస్థితులను స్వతంత్రంగా పరిశీలించి బాధ్యత ఎవరిదో తేల్చాల్సిన అవసరం ఉందని ఏఐఎస్‌ఏ పేర్కొంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఆధారాలతో విషయాలను బయటపెడతాం.

అధికారుల విచారణ నిష్పక్షపాతంగా జరగకపోతే తామే అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి సంబంధిత అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని బందు సుజాత హెచ్చరించారు. వార్డెన్‌ను కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే తమ ఆరోపణలపై కూడా ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.

విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణలో అధికారుల పాత్రలోనూ తప్పిదాలు బయటపడితే సంబంధిత ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో స్ఫూర్తి, కిరణ్ మై, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో ఆదివారం పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ నిర్వహించారు. గ్రామంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు.

ఎంపీడీవో రవీంద్రనాథ్, గ్రామ సర్పంచ్ సరితతో కలిసి ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితులను, అర్హతకు సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులు తదితర కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసి పరిశీలన చేపట్టారు.

మద్దులపల్లి గ్రామం నుంచి వివిధ కేటగిరీల కింద మొత్తం 15 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలు, వారి అర్హత, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి ప్రయోజనం అందేలా దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామపంచాయతీ కార్యదర్శి స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


 జయశంకర్ భూపాలపల్లి జిల్లా: స్వాతంత్య్ర పోరాటం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల ఉద్యమ నేతగా చిరస్మరణీయులని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీలో ఘనంగా నిర్వహించారు.

తొలుత మంజూరునగర్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాపూజీ నిజాయితీ, నిస్వార్థతకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మహనీయుడని కొనియాడారు. బాపూజీ ఆశయాలు, సిద్ధాంతాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో ఆయన చేసిన సేవలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇ. ఇందిర, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్, ఎలగొండ రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, గూట్ల తిరుపతి, కృష్ణమోహన్, అడ్డగట్ల శ్రీధర్, భాగవతం భిక్షపతి, కూచన కిషన్ ప్రసాద్, గొనె భాస్కర్, శేఖర్, పాశికంటి శ్రీనివాస్, షేరు కుమారస్వామి, గుండా వీరస్వామి, సుజాత, ప్రభాకర్, శ్రీధర్‌తో పాటు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇ. ఇందిర కృతజ్ఞతలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఉద్యమించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక పోరాట స్ఫూర్తి అని అన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీకగా నిలిచారని, మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. భూమి, హక్కులు, ఆత్మగౌరవం కోసం నాటి ఆధిపత్య భూస్వామ్య వ్యవస్థను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాటం తెలంగాణ చరిత్రలో సామాజిక న్యాయం కోసం జరిగిన ముఖ్యమైన పోరాటాల్లో ఒకటని అన్నారు.

సమాజంలో కులం, వర్గం పేరుతో ఆధిపత్యం చెలాయించే వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. తరతరాలుగా అవకాశాలకు దూరంగా ఉంచబడిన బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సముచిత వాటా దక్కాలని రవి పటేల్ అన్నారు.

చాకలి ఐలమ్మను గౌరవించడం అంటే ఆమె చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదని, ఆమె పోరాడిన ఆత్మగౌరవం, భూమి హక్కు, సామాజిక సమానత్వం కోసం నేటి తరంలో చైతన్యం తీసుకురావడమే నిజమైన నివాళి అని అన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఏ వర్గానికీ వ్యతిరేకంగా వ్యక్తిగత ద్వేషం తమ పార్టీకి లేదని రవి పటేల్ స్పష్టం చేశారు. అయితే ఆధిపత్య రాజకీయాలు, కుల అసమానతలు, పేదల హక్కులను హరించే విధానాలను మాత్రం ప్రశ్నిస్తామని తెలిపారు. రాజకీయ అధికారం కొద్దిమంది వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, జనాభాలో మెజారిటీగా ఉన్న బహుజన వర్గాలకు కూడా నిర్ణయాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం అనే లక్ష్యాలతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతుందని రవి పటేల్ తెలిపారు. ఐలమ్మ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ఇనుగాల ప్రణయ్ రాజ్, జినుకల శ్రీను, అనంతుల సంపత్, రోడ్డ శ్రీను, అశోక్, వెంకటస్వామి, రమేష్, కిరణ్, రజక ఆనంద్, శ్రీనివాస్ రజక, సుర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనపూర్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనపూర్‌లో ఏఐఎస్‌ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్‌ఏ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బుర్ర స్వాతి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ నాటి భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పేదలు, కూలీలు, మహిళల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తిదాయకమైన నాయకురాలని అన్నారు. అణచివేతకు ఏమాత్రం భయపడకుండా తన హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ జీవితం నేటి విద్యార్థులు, యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం జరిగిన ప్రజా పోరాటానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరం విద్యార్థులు, యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా సమస్యలు, అధిక ఫీజులు, నిరుద్యోగం, సామాజిక వివక్ష వంటి సమస్యలపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను అరికట్టి, పేద విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలను కొనసాగిస్తామని బుర్ర స్వాతి తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో విద్యార్థులు, యువత తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

చాకలి ఐలమ్మ చూపిన పోరాట మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడతామని ఏఐఎస్‌ఏ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఏ విద్యార్థులు ఐశ్వర్య, అనన్య, నేహా తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం సబ్ డివిజన్: కాటారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కాటారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తెప్పల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ అన్యాయానికి తలవంచకుండా అసాధారణ ధైర్యంతో పోరాడిన గొప్ప మహిళ అని అన్నారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

ఐలమ్మ తన భూమి కోసం మాత్రమే కాకుండా తనలాంటి ఎంతోమంది పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారని తెలిపారు. అన్యాయం ఎంత పెద్దదైనా దాని ముందు ధైర్యంగా నిలబడాలనే స్ఫూర్తిని తన జీవితంతో చూపించారని అన్నారు. హక్కుల కోసం పోరాడే ధైర్యం ఉంటే సామాన్య వ్యక్తి కూడా చరిత్రను మార్చగలడనే గొప్ప సందేశాన్ని ఐలమ్మ జీవితం అందిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవం, మహిళా ధైర్యం, సామాజిక న్యాయం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగాలను నేటి తరాలు స్మరించుకోవాలని నాయకులు అన్నారు. ముఖ్యంగా యువత ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతగాని సమ్మయ్య, ముత్తారం మండల అధ్యక్షుడు జాడి రాజయ్య, కాటారం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, కాటారం మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మంథని డివిజన్ యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, కాటారం మండల యూత్ అధ్యక్షుడు చిటూరు మహేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అజ్మీర కిషన్ నాయక్, కుంభం రమేష్ రెడ్డి, గడవేన దేవేందర్, ఐయిత శకుంతల, భూపెళ్లి రాజు, పసుల మొగిలి, కొట్టే ప్రభాకర్, చీమల రాజు, దేవదాస్, జాగరి రాజబాపు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, సెప్టెంబర్ 26: గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ఎంపిక చేయాలని సూచించారు. డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌ నిధులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులపై గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరయ్యే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీరు, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డులు జారీ చేసి ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని అన్నారు. గ్రామ పంచాయతీ, వీఓ భవనాలు, పాఠశాలలకు ప్రహరీలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ గ్రామాల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 2న నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో గ్రామాభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించి తీర్మానాలు ఆమోదించాలని అన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన పనులపై ముందుగానే ఇన్వెంటరీ సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళికలను పక్కాగా రూపొందించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీఎంఓ కౌసల్య దేవి, డీపీఓ శ్రీలత, ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా  కాటారం సబ్‌ కలెక్టర్‌ సౌరవ్‌ శర్మను కాటారం, మల్హర్‌, పలిమెల, మహముత్తారం మండలాల ఎంపీడీవోలు శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయా మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై సబ్‌ కలెక్టర్‌ ఎంపీడీవోలతో చర్చించారు. మండలాల వారీగా చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చూడడంతో పాటు, వారి సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభివృద్ధి పనుల అమలులో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎంపీడీవోలకు సబ్‌ కలెక్టర్‌ సూచించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాటారం, మల్హర్‌, పలిమెల, మహముత్తారం మండలాల ఎంపీడీవోలు బాబు, నిశాంత్‌, క్రాంతి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు వయోవృద్ధుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం, రక్షణ, గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007పై ప్రజలు, కుటుంబ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వయోవృద్ధులకు అవసరమైన సహాయం, భద్రత, సంక్షేమ సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

వయోవృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ సభ్యులు, సమాజం వయోవృద్ధుల పట్ల గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

వారోత్సవాల్లో భాగంగా వయోవృద్ధుల హక్కులు, ఆరోగ్యం, భద్రత, సామాజిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టపరమైన రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జి. మల్లేశ్వరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ అర్జున్, డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ కొలగూరి సంజీవరావు, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

రేగొండ, సెప్టెంబర్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేగొండ మండలం పాండవుల గుట్ట వద్ద ఈ నెల 26న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి శుక్రవారం పరిశీలించారు.

పర్యాటక దినోత్సవ కార్యక్రమానికి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమ ప్రాంగణంలో సందర్శకుల రాకపోకలకు అనుగుణంగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ విజయలక్ష్మి.. సందర్శకులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.


పర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, బాధ్యతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమానికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పాండవుల గుట్ట ప్రాంతం సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశంగా ఉండటంతో పర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రఘు, అటవీశాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందనున్నాయి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 24: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణ చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.

గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి భూసేకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలో ఓఎస్‌డీగా విధులు నిర్వహిస్తున్న మనోహర్‌తో కలిసి కలెక్టర్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులపై అధికారులకు అవగాహన కల్పించారు.

కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, సింగరేణి, జెన్‌కో, జాతీయ రహదారులు తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ జరుగుతోందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన రైతులకు చట్టప్రకారం పరిహారం, పునరావాసం, ఇతర పునరావాస ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భూసేకరణకు సంబంధించి రైతులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఓఎస్‌డీ మనోహర్ సూచించారు.

భూసేకరణ చట్టాలకు అనుగుణంగా ప్రతి దశను పక్కాగా నమోదు చేయాలని, సమావేశాల మినిట్స్‌ను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు అవసరమైన చోట్ల వీడియో రికార్డింగ్ చేపట్టాలని తెలిపారు. భూములు ఇచ్చే రైతులను కేవలం భూమి ఇచ్చేవారిగా కాకుండా అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా గౌరవించాలని సూచించారు. అధికారుల వైఖరి కారణంగా రైతుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించి తలెత్తే వివాదాలను నిబంధనల ప్రకారం విచారించి పరిష్కరించాలని, ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న వారి అర్హతలను తహసీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూసేకరణలో భూమి విస్తీర్ణం, రికార్డుల వివరాలు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మనోహర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాటారం సబ్‌ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఏఓ శ్రీనివాసులు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్: కరెంట్ కోతలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పవర్ ప్లాంట్ల ముట్టడి కార్యక్రమానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న నేపథ్యంలో మహాదేవపూర్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచివేసే చర్యలుగా వారు పేర్కొన్నారు.

రైతులకు నిరంతర విద్యుత్ ఎక్కడ?

రైతులకు 24 గంటల పాటు నిరంతరంగా, నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపించేదని నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు ఏర్పడుతున్నాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బొగ్గు కొరత సాకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ బొగ్గు నిల్వలు సరిపోవడం లేదంటూ ప్రభుత్వం సాకులు చెబుతోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఖరీఫ్ పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి.

ప్రజలు అధికారాన్ని అప్పగించింది రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రైతులకు నిరంతర విద్యుత్ అందించడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముందస్తు అరెస్టులపై ఖండన.

పవర్ ప్లాంట్ల ముట్టడి కార్యక్రమానికి ముందే నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, శాంతియుతంగా తమ నిరసనను తెలియజేయాలనుకున్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదని అన్నారు.

ముందస్తుగా అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీపతిబాపు, కేదారి గీత, అలీం ఖాన్, కూరతోట శ్రీహరి, చిల్ల కుమార్, వెన్నంపల్లి మహేష్, రెవెల్లి రాజశేఖర్, ఇస్తియాక్, కడారి రమేష్ తదితరులు ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యుత్ కోతలకు శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి : అక్షితరాణి నివాసాన్ని సందర్శించి దర్యాప్తు అధికారులకు కీలక సూచనలు చేసిన పోలీస్ కమిషనర్ గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసును గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు ఛేదించి,నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ కేసు అత్యంత ప్రాధాన్యత కలిగిన సున్నితమైన కేసు కావడంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి బుధవారం మృతురాలు అక్షితరాణి నివాసాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతి,నేరానికి సంబంధించిన వివరాలు,నేరం జరిగిన తీరు తదితర అంశాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్న సీపీ,దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు,కేసులో తుది న్యాయస్థాన తీర్పు వచ్చే వరకు దర్యాప్తు,ప్రాసిక్యూషన్ ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగించాలని సీపీ ఆదేశించారు.దర్యాప్తులో ఎలాంటి లోపాలు,అలసత్వం,నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.కేసులోని ప్రతి సాంకేతిక, న్యాయపరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తును పూర్తి చేయాలని,ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)నివేదికలు,ఇతర శాస్త్రీయ ఆధారాలను సక్రమంగా సేకరించి,కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.నిందితులకు న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా కేసును పటిష్టమైన ఆధారాలతో ముందుకు తీసుకెళ్లాలని,దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్‌లో సమన్వయంతో పనిచేయాలని ఏసీపీ,ఇన్స్పెక్టర్ లను సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మడే సమ్మక్క దశదిన కర్మలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మడే సంతోష్ నానమ్మ మడే సమ్మక్క కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. పార్టీ కోసం క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తున్న మడే సంతోష్ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్‌లోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

నాగారం టీఆర్‌పీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చిడం ధర్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు గండు కరుణాకర్, పిట్టల వెంకటేష్, మోటపోతుల సమ్మయ్య, జిల్లా కోశాధికారి జినుకల శ్రీను, వ్యవసాయ విభాగం అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, కార్మిక విభాగం అధ్యక్షుడు, భూపాలపల్లి మండల అధ్యక్షుడు మీసాల రాజు, మనోహర్రావు మండల అధ్యక్షుడు మేనం సంతోష్, నాగారం గ్రామ కమిటీ నాయకులు, టీఆర్‌పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విస్తృతంగా పర్యటించారు. కాటారం మండలంలోని చింతకాని బీట్, చింతకాని సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటవీ సంరక్షణ చర్యలు, అటవీ ప్రాంతాల పరిస్థితి, వన్యప్రాణుల రక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ తదితర అంశాలపై పరిశీలన చేపట్టారు. కాళేశ్వరం జోన్ పరిధిలో అటవీ సంరక్షణకు చేపడుతున్న చర్యలను అధికారులు పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, గస్తీ నిర్వహణపై సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. అటవీ సంపదకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై సమీక్షించారు. ఈ పర్యటనలో కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ ప్రభాకర్, ఐఎఫ్‌ఎస్ కిష్టగౌడ్, ఐఎఫ్‌ఎస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారి సందీప్ రెడ్డి, మహదేవ్‌పూర్ డివిజన్ అటవీ రేంజ్ అధికారి స్వాతి, కాటారం డీవైఆర్‌ఓ హెచ్. సురేందర్ నాయక్, యమన్‌పల్లి డీవైఆర్‌ఓ ఝాన్సీ రాణి, చింతకాని సెక్షన్ అటవీ సెక్షన్ అధికారి సోనీ కిరణ్, దామెరకుంట సెక్షన్ అటవీ సెక్షన్ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే కాటారం, దొబ్బలపాడు పరిధి అటవీ బీట్ అధికారి ఎం. రాజేందర్, యమన్‌పల్లి అటవీ బీట్ అధికారి కోట సంజీవ్, యమన్‌పల్లి వెస్ట్ అటవీ బీట్ అధికారి హరీష్, ఇతర అటవీ సిబ్బంది, డ్రైవర్లు మహమూద్, రహీం, గౌస్‌తో పాటు బేస్ క్యాంప్ వాచర్లు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ సంపద పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు చోటుచేసుకోకుండా క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అటవీ రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని అధికారులు సూచించినట్లు సమాచారం. కాటారం రేంజ్ పరిధిలోని చింతకాని బీట్, చింతకాని సెక్షన్ ప్రాంతాల్లో అధికారుల పర్యటనతో క్షేత్రస్థాయిలో అటవీ సంరక్షణ చర్యలపై మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, సెప్టెంబర్ 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదినేపల్లి క్లస్టర్ పరిధిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన రైతుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) శ్రీ కన్య తెలిపారు. రైతుల సౌకర్యార్థం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

చిదినేపల్లి క్లస్టర్ పరిధిలోని అర్హులైన రైతులు తమ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రైతులు తమకు సంబంధించిన పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ)ను సంప్రదించి నేరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పథకాలు, రైతులకు అందించే రాయితీలు, ఇతర ప్రయోజనాలను భవిష్యత్తులో సకాలంలో పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కీలకమని ఏఈఓ శ్రీ కన్య తెలిపారు. ఇప్పటివరకు నమోదు చేసుకోని అర్హులైన రైతులు ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ నెల 30వ తేదీలోగా తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

రైతులు అవసరమైన వివరాలతో సంబంధిత ఏఈఓను లేదా సమీప మీ-సేవ కేంద్రాన్ని సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. చిదినేపల్లి క్లస్టర్ పరిధిలోని రైతులందరూ ఈ ప్రత్యేక క్యాంపులను సద్వినియోగం చేసుకుని ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌ (ఏటీసీ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మంత్రి మాట్లాడి, వారికి అందుతున్న శిక్షణ, సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ఏటీసీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తొలి విడతగా 65 కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాటారం ఏటీసీలో మొదటి సంవత్సరంలోనే 172 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం సంతోషకరమన్నారు.

ప్రిన్సిపాల్‌, శిక్షకులు, సంబంధిత సంస్థల సమన్వయంతో విద్యార్థులకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. పాత ట్రేడ్స్‌కే పరిమితం కాకుండా రోబోటిక్స్‌, బ్యాటరీ తయారీ, ఆధునిక తయారీ రంగాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను గుర్తించి శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు.

కాటారం కేంద్రంలో ల్యాబ్‌లు, తరగతి గదులు, కాన్ఫరెన్స్ హాల్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు యూనిఫాం, షూస్‌ను తన సొంత ఖర్చులతో అందిస్తానని శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చెల్పూర్, సెప్టెంబర్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ మండలం బసవరాజుపల్లి మీదుగా గణపురం వైపు నడిచే బస్సు రాకపోకలకు రోడ్డు పనుల కారణంగా అంతరాయం ఏర్పడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐసా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి తెలిపారు.

బసవరాజుపల్లి నుంచి గణపురం వెళ్లే ప్రధాన రహదారిలో ప్రస్తుతం రోడ్డు పనులు కొనసాగుతున్నందున బస్సు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని డ్రైవర్ విద్యార్థులకు తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఐసా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సంబంధిత బస్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గంలో బస్సు నడిపించి విద్యార్థులకు నిరంతర రవాణా సౌకర్యం కల్పించాలని బుర్ర స్వాతి కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, సెప్టెంబర్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాఠశాల ఆవరణలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతాపగిరి ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకరయ్య, వార్డు సభ్యురాలు బీసుల స్వరూప, ఫీల్డ్ అసిస్టెంట్ స్పందన స్వామి, గ్రామస్తులు కొండ రాములు, గుంటి కిష్టయ్య, బందరు కిష్టయ్య, పొలం సమ్మయ్య, గుంటి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, గణేష్ విగ్రహాల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా టీజీఎన్‌పీడీసీఎల్‌ చీఫ్ ఇంజినీర్, భూపాలపల్లి సర్కిల్ నోడల్ అధికారి శ్రీమతి అన్నపూర్ణ కాటారం డివిజన్ పరిధిలోని నిమజ్జన మార్గాలను పరిశీలించారు.

కాటారం, మహాదేవపూర్, కాళేశ్వరం మార్గాల మీదుగా గణేష్ విగ్రహాలను తరలించే వాహనాలు ప్రయాణించే సమయంలో విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారకుండా అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. రహదారుల వెంట ఉన్న విద్యుత్ లైన్లను పరిశీలించి, విగ్రహాల వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడైనా విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం కాళేశ్వరం గోదావరి నది వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో భూపాలపల్లి సర్కిల్ ఎస్‌ఈ సదానందం, డీఈ టెక్నికల్ జగదీష్, కాటారం డీఈ నాగరాజు, కాటారం–మహాదేవపూర్ ఏఈ రమేష్, మహాదేవపూర్ సబ్‌ఇంజినీర్ ప్రశాంత్, కాళేశ్వరం లైన్ ఇన్‌స్పెక్టర్ సదానందం, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా అధికారులు మార్గాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నోడల్ అధికారి, ఎంపీడీవో అడ్డూరి బాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని వివిధ శాఖలకు చెందిన 15 మంది అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి దరఖాస్తులు సమర్పించారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించిన పలు దరఖాస్తులు ప్రజావాణిలో అందాయి. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో అడ్డూరి బాబు తెలిపారు.

ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, సెప్టెంబర్ 21: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన TGSS క్రీడాకారుడు లింగమల్ల కౌశిక్ రామ్ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఘట్‌కేసర్‌లో సెప్టెంబర్ 16న నిర్వహించిన అండర్‌–12 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కౌశిక్ రామ్ సాబ్రే విభాగంలో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకం సాధించాడు. చిన్న వయసులోనే ఫెన్సింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న కౌశిక్ రామ్, రాష్ట్రస్థాయి పోటీల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. కఠినమైన పోటీల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొని పతకం సాధించడంతో పాటు జమ్మూ కాశ్మీర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా కౌశిక్ రామ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ విజయం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేసి పతకం సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కౌశిక్ రామ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, కోచ్‌లు, TGSS నిర్వాహకులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సమావేశం ఈనెల 22వ తేదీ మంగళవారం రోజు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగాల రామయ్య కార్యక్రమ నిర్వాహకులు నమూన్ల సంపత్ మహారాజు తెలిపారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర అనగారిన వర్గాల హక్కుల సాధనలో నిరంతరం   ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పనిచేస్తుందన్నారు దళిత బహుజన అనగారిన వర్గాల కోసం పని  చేయాలనే ఆసక్తి కలిగిన వారు నూతన కమిటీ ఏర్పాటుకు హాజరై సహకరించవలసిందిగా కోరారు ఉదయం 10:30 నిమిషాలకు కొయ్యూరు లో జరిగే సమావేశానికి మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర అనగారిన,వర్గాలు హాజరు కావలసిందిగా కోరారు, ఈ సమావేశానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బూడిద రాజయ్య సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగిరాల సందీప్,ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్,జిల్లా కోఆర్డినేటర్ పొట్ల పోచయ్య హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు 


కృతజ్ఞతలతో 

లింగాల రామయ్య 

రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి 

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, 

78160,68871

నమూన్ల సంపత్ మహారాజ్ 

కార్యక్రమ నిర్వాహకులు,

93813,53694

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వార్డు సభ్యుడు వేల్పుల రాజమల్లు, దేవక్కలను కాంగ్రెస్ నాయకులు గురువారం పరామర్శించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. వికలాంగుల పింఛన్‌తో పాటు బీమా సౌకర్యం కల్పించేలా సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, శంకరంపల్లి సర్పంచ్, మండల ఫోరం అధ్యక్షుడు అజ్మీర కిషన్‌నాయక్, సీనియర్ నాయకులు నవీన్‌రావు, పాగే సురేష్, కోడిపెల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గద్దె సమ్మిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అంగోత్ సుగుణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం సప్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల, వైస్ చైర్మన్ చిన్నాల బ్రహ్మారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, మంథని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మండల మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అజ్మీర కిషన్ నాయక్, కాటారం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టూరి మహేష్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: బీసీల రాజ్యాధికారం, సామాజిక సమానత్వం లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 14,500 కిలోమీటర్ల బీసీల రాజ్యాధికార పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని గోల్కొండ నుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ.. పాదయాత్రను దశలవారీగా నిర్వహిస్తూ బీసీలకు రాజ్యాధికారం, అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు గోల్కొండకు తరలివచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్, వెంకటేష్, సంతోష్, శ్రీను, రాంబాబు, సతీష్, ముక్తేశ్వర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


భూపాలపల్లి, సెప్టెంబర్ 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నియమితులైన పురుషోత్తం అనూప్ బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవన్‌లో మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ఎన్‌ఎస్‌యూఐ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లా, మండల స్థాయిలో విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రతి కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐను విస్తరించాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మంత్రి మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐను మరింత బలోపేతం చేసి విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని పురుషోత్తం అనూప్ తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ ప్రదాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురించి హమర ప్రసాద్ ‘అంబేద్కర్ కల్పిత నాయకుడు’ అనే పుస్తకాన్ని రచిస్తున్నట్లు/ప్రచురిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, మహాముత్తారం మండల అధ్యక్షులు రామగిరి రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం, ఆలోచనలు, సామాజిక ఉద్యమం మరియు రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను వక్రీకరించే విధంగా ఎలాంటి ప్రచారం జరిగినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని గౌరవ అధ్యక్షులు లింగమళ్ళ సడవలి రావ్ తెలిపారు. చారిత్రక వ్యక్తులపై అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, చారిత్రక ఆధారాలను వక్రీకరించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదా ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచురణలు చేయడం సమాజంలో అనవసరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చని ప్రధాన కార్యదర్శి లింగమళ్ళ శంకర్ పేర్కొన్నారు. అందువల్ల ‘అంబేద్కర్ కల్పిత నాయకుడు’ పుస్తకంలోని విషయాలను సంబంధిత అధికారులు, మేధావులు మరియు అంబేద్కర్‌వాద సంఘాల సమక్షంలో పరిశీలించాలని కోశాధికారి వేల్పుల రావణ్ కోరారు.  పుస్తకంలో అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నట్లు తేలితే, చట్టపరమైన మార్గాల్లో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటాం. ఎలాంటి అభ్యంతరకర అంశాలు ఉన్నా వాటిపై చట్టబద్ధంగా పోరాటం చేస్తాం” అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్ ఆశయాలైన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కోసం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ప్రజా ప్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి పంగ సురేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి:సుల్తానాబాద్:సెప్టెంబర్:16 :ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజి బీటెక్ విద్యార్థి తాండ్ర అక్షితరాణి ఆత్మహత్యకు కారకులైన పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్,సింగరేణి ఓవర్ మెన్ బొమ్మకంటి రవికుమార్ లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి..ప్రభుత్వం ఆకుటుంబానికి అండగా నిలవాలి...గోదావరిఖని లెనిన్ నగర్ లో తాత్కాలికంగా నివాసముంటున్న తాండ్ర అక్షిత రాణి 21 సంll,శనివారం 12 సెప్టెంబరు సాయంత్రం గడ్డి మందు తాగి13సెప్టెంబర్ 2026 ఆదివారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మృతి చెందిన సంఘటనపై పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రేగడి మద్దికుంట గ్రామములో అక్షిత తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి సేకరించిన వివరాలు.. ఎస్సీ దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాండ్ర ఐజాక్ పాస్టర్ రజితల కూతురు తాండ్ర అక్షితరాణి గర్రెపల్లిలో గురుకుల పాఠశాలలో పదవ తరగతి పాసై 2022లో మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలిటెక్నిక్ లో మైనింగ్ డిప్లమా చేస్తున్న కాలంలో రెండవ సంవత్సరములో ఆకాలేజీ లెక్చరర్(పాలిటెక్నిక్)జెట్టి నవీన్,అక్షితరాణిపై తీవ్రమైన లైంగిక వేధింపులు చేస్తే కుటుంబ సభ్యులు కాలేజీకి పోయి వేధింపులకు వ్యతిరేకంగా నవీన్ ను నిలదీస్తే అతను వారిని తీవ్రంగా బెదిరింపులు.భయభ్రాంతులకు గురి చేశాడని తెలిపారు.ఆసందర్భంగా బెదిరిపోయిన అక్షిత తల్లిదండ్రులు మేనమామలు చదువు క్యారియర్ కోసం జాగ్రత్తతో పాలిటెక్నికు మైనింగ్ డిప్లవం కోర్సు పాస్ అయింది.డిప్లమా విద్యార్థులకు ఈసెట్ ఎంట్రెన్స్ ద్వారా మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ లో అడ్మిషన్లు భాగంగా అక్షిత ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ హైదరాబాదులో అడ్మిషన్ తీసుకుంది.బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో అప్రెంటిషిప్ కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గు గనుల ప్రాంతంలో గోదావరిఖని రామగుండం డివిజన్ 1 లోని 2 ఇంక్లైన్ బొగ్గు బావిలో జనవరి ఫిబ్రవరి 2026 లో 12 రోజుల అప్రెంటిషిప్ చేసింది. ఆ బొగ్గుగని మైనింగ్ సూపర్వైజర్ బొమ్మ కంటి రవికుమార్ అక్షితను వేధింపులకు గురి చేసిండు రవికుమార్ కూడా నస్పూర్ పాలిటెక్నిక్ లో మైనింగ్ డిప్లమా చదివినాడు రవికుమార్,నవీన్ లెక్చరర్ స్టూడెంట్ వీరిద్దరి మధ్యల చాలా సాన్నిత్యము ఉంది.కొద్ది రోజులు ఉస్మానియా యూనివర్సిటీకి క్లాసులకు అక్షిత పోతున్న సందర్భంగా కూడా రవి కుమార్ వేధింపులు కొనసాగించాడు.ఈ వేధింపుల వల్ల కొద్ది రోజులు అక్షిత యూనివర్సిటీ క్లాసులకు పోకుండా ఇంటి దగ్గరే ఉంది,తిరిగి ఓయూ ప్రొఫెసర్ ను కలిసి 4వ సెమిస్టర్ లో జాయిన్ అయింది.అప్పుడు తన తల్లి తండ్రి మేనమామ,అడ్వకేట్ జీవన్ కుమారులతో కలిసి,అప్రెంటిషిప్ కాలంలో జీడికే టూయింగ్ లైన్ లో ఓవర్ మెన్ రవికుమార్ తనపై చేసిన వేధింపులపై రామగుండం డివిజన్ వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.పోలీస్ స్టేషన్ లేదా సింగరేణి హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయమన్నాడు జిఎం..గత కొద్ది కాలంగా వర్క్ నాలెడ్జి కోసం గోదావరిఖని గౌతమి నగర్ లోని ఒక ఆటోమొబైల్ షాప్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా అక్షితారాణి పని చేస్తున్నది,12 సెప్టెంబర శనివారం సాయంత్రం డ్యూటీ నుండి గోదావరిఖని బస్టాండ్ కు ఆటోలో వస్తున్నానని తన తండ్రికి ఫోన్ చేసి బస్టాండ్ వద్దకు సాయంత్రం 6:30 గంటలకు రమ్మన్నది.కొద్దిసేపటికి తనకు వాంతులు అవుతున్నాయని గోదావరిఖని బస్టాండ్ వద్ద ఉన్నానని అక్షిత తండ్రికి ఫోన్ లో చెప్పింది వర్షం ఉన్నందున ఆటో తీసుకొని తండ్రి ఆమెను ఇంటికి రమ్మన్నాడు.కొద్ది సేపు తర్వాత ఫోన్ చేస్తే అక్షిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు.45 నిమిషాల తర్వాత ఏడున్నర గంటలకు అక్షిత తండ్రికి నవీన్ ఆమె ఫోన్ నుండి కాల్ చేసి,అక్షిత గడ్డి మందు తాగిందని చెప్పి ఆమరుక్షణమే వాళ్ల ఇంటి దగ్గరలోని చర్చి వద్దకు భారీ వర్షం కురుస్తున్న సమయంలో కారులో నవీను అక్షితను నోటి నుండి నురుగలు కక్కుతున్న స్థితిలో తీసుకువచ్చి అక్షిత తల్లిదండ్రులతో పాటు అతని కారులో గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ అడ్మిట్ చేయించారు.తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితికి లోనై 13 సెప్టెంబర్ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు అక్షిత మరణించారు.మొత్తం ఈ వ్యవహారంలో పాలిటెక్నిక్ లెక్చరర్ నవీన్ వేధింపులు రవికుమార్ల ఆగడాలతోనే మనస్థాపానికి గురై అక్షితరాణి ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా పౌర హక్కుల సంఘం నాయకులు భావించి ఈ పత్రిక ప్రకటన ద్వారా వివరిస్తున్నాం.గోదావరిఖనిలోని లెనిన్ నగర్ లో ప్రస్తుత నివాసముంటున్న అక్షిత తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని తమ సొంత గ్రామమైన రేగడి మద్దిగుంటకు అదే రోజు రాత్రి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు...డిమాండ్స్ 1.అక్షితరాణి ఆత్మహత్యకు కారకులైన పాలిటెక్నిక్ లెక్చరర్ జెట్టి నవీన్,సింగరేణి ఓవర్ మెన్ బొమ్మ కంటి రవికుమార్ లపై ఎస్సీ ఎస్టీ ఆస్ట్రాసిటీ కేసు నమోదు చేయాలి.వెంటనే ఆఇద్దరిని పోలీసులు అరెస్టు చేయాలి.2 అక్షిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.3.సింగరేణి రామగుండం డివిజన్ వన్1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ నిర్లక్ష్యంగా అక్షిత ఫిర్యాదుపై వ్యవహరించినందున చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలి,4 పాలిటెక్నిక్ విద్యా సంస్థలు,సింగరేణి ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నివారణ కోసం మహిళా ఉద్యోగులు,మహిళా ఆఫీసర్లు,పోలీస్ షీటీంల ఆధ్వర్యంలో మహిళా వేధింపుల నిరోధక కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి..5.బుధవారం వరకు ఈ సంఘటన పట్ల పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ మరియు రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ లు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు,ఇది అత్యంత బాధ్యతారహిత్యం. జయహో అని పేర్కొన్నారు..ఈ నిజ నిర్ధారణలో పాల్గొన్న వారు మాదన కుమారస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌరహక్కుల సంఘం తెలంగాణ.9849548275నార వినోద్,ఉపాధ్యక్షుడు,పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ,బండారి రాజలింగం,బండి శంకర్ గౌడ్,బండి సతీష్ గౌడ్,ప్రజా సంఘాల నాయకుడు,మృతురాలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...