మహాముత్తారం: మహాముత్తారం మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని గత నెల రోజుల క్రితం ఎలాంటి సమాచారం లేకుండా కాటారం మండల కేంద్రానికి తరలించడంపై కుల ప్రజా సంఘాల జేఏసీ, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహిస్తూ హాస్టల్‌ను తిరిగి మహాముత్తారంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి బీసీ హాస్టల్‌ను తిరిగి మహాముత్తారం మండల కేంద్రానికి తరలించారు. అనంతరం కుల ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్‌తో పాటు అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, ఐత బాపు, రామగిరి రాజు, లింగామల్ల సడవాలి రావు తదితరులు హాస్టల్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. హాస్టల్ తరలింపు కోసం కుల ప్రజా సంఘాల జేఏసీ చేసిన పోరాటాన్ని పలువురు అభినందించారు.


Post A Comment: