మేడిగడ్డ టీవీ న్యూస్, ఆత్మకూరు ప్రతినిధి, మధు
పెద్దాపూర్ ఎం జె పి లో ఆర్ సి ఓ తనిఖీ సమయంలో పాఠశాలలోని వంటశాల మరియు ఇతర ముఖ్య అంశాలను (బియ్యం, కూరగాయలు, నిలువచేసే స్టాండులు, వంట సరుకులు, వంటగిన్నెల శుభ్రపరిచే విధానం) పరిశీలించారు. ఆర్ సి ఓ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు టెన్త్ డీలింగ్ టీచర్లతో సమావేశమై, సబ్జెక్టుల వారిగా గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2 పేపర్లను కూడా పర్యవేక్షించారు.
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొని, పదవ తరగతి విద్యార్థులు రాబోయే సెకండరీ బోర్డు పరీక్షలకు సంభందించి భయాలు లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని అమూల్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దామరానిత, వైస్ ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



Post A Comment: