గోదావరి నుంచి మూసీ నదికి నీటి తరలింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. గుజరాత్, యూపీ రివర్ ఫ్రంట్లకు నిధులిచ్చి నదుల ప్రక్షాళన చేశారన్నారు. గోదావరి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీకి తరలించే ప్రాజెక్టుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు. మూసీ ప్రక్షాళన పనులకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని నిర్ణయించింది, దీనికోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ నదిలో మురుగునీరు కలవకుండా 37 ఎస్టీపీల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి మూసీ నదిపై ఉన్న హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లలో మంచినీరు నింపి.. ఆ నీటిని నిరంతరం మూసీలో ప్రవహింపజేసేలా సన్నాహాలు చేస్తుంది. 2026 జూన్‌ నాటికి మంచినీటితో మూసీ కళకళలాడాలన్నది ప్రభుత్వ సంకల్పం. మూసీ ఆక్రమణల్ని తొలగించి వరదల నుంచి విపత్తులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు.. నదీ పరివాహకంలో నివాసముంటున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు కూడా చేపట్టింది. మూసీ ప్రక్షాళనలో ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూం ఇస్తాం. ఇప్పటికే 309 మందికి ఇచ్చాం. ప్రతిపక్షాలు వస్తే ఎక్కడ… ఎవరెవరికి ఇచ్చామో చూపిస్తాం. మూసీ ప్రక్షాళనలో ఉపాధి కోల్పోయే వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుంది. చట్ట ప్రకారం నష్ట పరిహారం అందజేస్తాం. ఎవరికీ అన్యాయం జరగదు అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనను అత్యంత ప్రణాళికాబద్ధంగా చేపడతాం. కన్సల్టెన్సీ నుంచి నివేదిక అందిన తర్వాత రెండో దశ, మూడో దశ పనులపై నిపుణులను భాగస్వామ్యం చేసి నిర్ణయం తీసుకుంటాం. నమో గంగే, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కానీ… ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. గోదావరి నది నుంచి 2.5 టీఎంసీ నీటిని మూసీకి తరలించేందుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కానీ… కేంద్రం స్పందించడం లేదు. నిధుల కేటాయింపులో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుంది. తెలంగాణ కూడా ఈ దేశంలోనే భాగమని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు చొరవ చూపి… ఈ ప్రాజెక్ట్ కు కేంద్రం నిధులు కేటాయించేలా చొరవ చూపాలని కోరుతున్నా.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: