February 2025
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

 హనుమకొండ లోని చారిత్రక వేయిస్తంబాల గుడిని హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ శుక్రవారం సందర్శించారు. ఆలయ సందర్శనకు వచ్చిన యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ కు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 

ఆలయంలో రుద్రేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు పూలమాల,శాలువలతో యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ ను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఫోర్ట్ వరంగల్ ను సందర్శించారు. యూఎస్ కాన్సుల్ జనరల్ వెంట పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

ఇంటర్ పరీక్షలను  పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం  రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి   ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. 

ఇంటర్ పరీక్షల పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ,మార్చ్ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని, రేపటి నుంచి ప్రశ్నాపత్రాలు స్ట్రాంగ్ రూమ్ లో నుంచి పోలీస్ స్టేషన్లకు చేరుతాయని అన్నారు. 

ప్రశ్నాపత్రాలు తరలింపు పోలీసు బందోబస్తు మధ్య ఉంటుందని అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాలు జిల్లాలో జరిగాయని, అవసరమైన మేర ఫ్లయింగ్ స్క్వార్డులను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. పరీక్షలు నిర్వహించి సంబంధిత జవాబు పత్రాలు పోస్టల్ ద్వారా పంపే వరకు వరకు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 

ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉండాలని, సండే పంపు లోపల జిరాక్స్ షాపులను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులను పూర్తిగా చెక్ చేసి లోపలికి 

అనుమతించాలని ఎటువంటి కాపీయింగ్ కు పరీక్ష కేంద్రాల్లో అవకాశం ఉండవద్దని సీఎస్ తెలిపారు. 

పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకుని రావడానికి వీలు లేదని సిఎస్ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన త్రాగు నీరు,  విద్యుత్ సరఫరా ఉండాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులు నడపాలని అన్నారు. 

ఎల్ఆర్ఎస్ పై సమీక్షిస్తూ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్ - 2020 క్రింద 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత సెప్టెంబర్ 2024 లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని దరఖాస్తుల క్రమబద్ధీకరణ మాత్రమే జరిగిందని అన్నారు.   

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఎల్ఆర్ఎస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో  రుసుము చెల్లించి క్రమబద్దికరణ చేసుకోవచ్చని తెలిపారు.  లక్షా 90 వేల వరకు ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఆమోదించే వాటికి మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుము లో 25% మినహాయింపు ఉంటుందని సమాచారం అందించామని అన్నారు. ఆగస్టు 26, 2020 వరకు 10% ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లను క్రమబద్ధికరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, సబ్ రిజిస్టర్ ద్వారా నిర్ణయిత నమూనాలో నూతన దరఖాస్తులు సేకరించి ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు.  క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమ బద్దీకరణ చేసుకోవాలని, మార్చి 31 వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని తెలిపారు. ఈ సమావేశంలో  జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోపాల్, ఆర్డీవో  రాథోడ్ రమేష్  సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడిగడ్డ టీవీ న్యూస్, ఇంచార్జి :- అనపర్తి సాయితేజ

వనపర్తి జిల్లా బీసీ నూతన కన్వీనర్ గా వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పలుస శ్రీనివాస్ గౌడ్ నియామకమయ్యారు, మంగళవారం బీసీ సమాజ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు నుంచి నియామక పత్రం అందించడం జరిగింది.బీసీ బావజాల వ్యాప్తికి వనపర్తి జిల్లా మొత్తం కృషి చేసి భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని శ్రీనివాస్ గౌడ్ అన్నారు..ఈ నియామక కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం. శ్రీనివాస్ సాగర్ పాల్గొన్నారు.. శ్రీనివాస్ గౌడ్ బీసీ సమాజ్ కన్వీనర్ గా నియామకం కావడం పట్ల వివిధ బీసీ సంఘాలు గౌడ సంఘాలు ప్రతి ఒక్కరూ పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ రాజ్యాంగం ప్రకారం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేసేందుకు నిరంతరం పోరాటం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు శ్రీనివాస్ గౌడ్ రాజీలేని పోరాటం చేయాలని పలువురు ఆకాంక్షించారు,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్:

పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై 24 జిల్లాల కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా పెట్టాలని ఆయన సూచించారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడుల నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులకు తెలిపారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని, పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు తనిఖీ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, అక్కడ సీసీ కెమెరాలు లేదా నిరంతరాయంగా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్రతి పోలింగ్ బృందానికి అవసరమైన మేర పోలింగ్ సామాగ్రి, పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, పోస్టల్ బాక్స్ అoదేవిధంగా చూడాలని, వీటి తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు అందించాలని ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని , ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను జాగ్రత్తగా రిసెప్షన్ కేంద్రాలకు తీసుకొని రావాలని, పోలీస్ భద్రతతో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అందుకు సంబంధించిన ప్రాథమిక సౌకర్యాలు కల్పనలో భాగంగా త్రాగునీరు మరియు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతిభద్రతల పరిరక్షణ గాను పోలీస్ శాఖచే తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పాసులు జారీ చేయడం జరిగిందని, రెండు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మరొకమారు ప్రాథమిక సౌకర్యాల మరియు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లను సిబ్బందిచే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా పోలింగ్ బాక్స్ తరలించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


జయశంకర్ భూపాలపల్లి జిల్లా

గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణం జరిగింది. డబ్బా పాలు  వికటించి ఇద్దరు నాలుగు నెలల కవల పిల్లలు మృతి చెందారు. వివరాలలోకి వెళితే. మర్రి లాస్య శ్రీ,అశోక్ దంపతులకు రెండవ సంతానంలో కవల పిల్లలుగా పాప,బాబు జననం జన్మించారు.శనివారం డబ్బా పాలు వికటించి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు.దీంతో వారి కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకొని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 
ఉమ్మడి వరంగల్:
మార్చి 08 న జరిగబోయే జాతీయ లోక్ అదాలత్ కంటే ముందు ఈనెల 26 నుండి మర్చి 07 వరకు ప్రీ లోక్ అదాలత్ లు నిర్వహించడం జరుగుతుందని కక్షిదారులు రాజి మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్,   పి. నారాయణ బాబు  తెలిపారు. 
రాజి మార్గంలో పెద్దఎత్తున కేసులు పరిష్కారం చేసే ఉద్దేశంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్ లు నిర్వహించడం జరుగుతుందని  జడ్జి  తెలిపారు. రాజి పడదగిన అన్ని సివిల్, క్రిమినల్, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ ఫండ్ కేసులు, వైవాహిక కేసులు, ఆస్థి తగాదాలు, అన్ని రకాల ట్రాఫిక్ కేసులు పరిష్కరించబడతాయని వారు అన్నారు. క్షణిక ఆవేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదని, విలువైన సమయం, మనశాంతి మరియు డబ్బు కోల్పోవాల్సి వస్తుందని జడ్జి  అన్నారు. రాజి మార్గమే రాజా మార్గమని, సోదరభావంతో స్నేహపూర్వక వాతారణం లో ప్రజలు జీవించాలని వారు సూచించారు .
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్, ఇంచార్జి :- అనపర్తి సాయితేజ

కాటారం మండలం బయ్యారం గ్రామం పంచాయితీ పరిధిలో బయ్యారం చెరువు లో జోరుగా మట్టి తవ్వకాలు. బయ్యారం గ్రామ చెరువు అధీనం లో ఉంది ఎలాంటి అనుమతులు లేకుండా. ఐ బి పర్మిషన్ కొందరు బడ బాబులు కలిసి బయ్యారం గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న చందన వెంచర్ పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసి నూతన వెంచర్ పెట్టడానికి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. 

చోద్ధం చూస్తున్న రెవిన్యూ అధికారులు మరియూ బయ్యారం గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికారులు, మట్టి తవ్వకాలు జరిపిన బడ బాబులు. వారిపై చర్యలు మాత్రం శూన్యం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి దందాను నిలిపివేసి, దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, కోరారు,




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్, ఇంచార్జి :- అనపర్తి సాయితేజ 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్, భర్త నాగవెల్లి రాజలింగమూర్తి, దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు  పట్టణంలోని రెడ్డి కాలనీలో  అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో రాజలింగమూర్తి కుప్పకూలిపోయాడు.  కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  హత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్ ఆత్మకూరు ప్రతినిధి మధు

ఆత్మకూర్ లోని పోచమ్మ సెంటర్లో బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతరాజు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని హిందూ గుడులను కాపాడిన మహారాజు అని చత్రపతి శివాజీ మహారాజ్ ప్రతి ఒక్క హిందువు మరవకూడదని నేటి యువత ఆయన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బరుపట్ల కిరీటి, రాజు, తనుగుల సందీప్, ఉప్పునూతల శ్రీనివాస్, కోమాండ్ల చంద్రారెడ్డి,  చిమ్మని దేవరాజు , కోలా రాంపాల్,  వడ్డేపల్లి ప్రసాద్, నాగేల్లి స్వామి,  కొమ్ముల ప్రభాకర్, మంద రవి, గొట్టిముక్కుల మల్లారెడ్డి, ఉప్పునూతుల శంకర్ జి, నాగ బండి శివప్రసాద్ జి,  పరికిరాల రాజయ్య, ఏరుకొండ రంజిత్, మొదలగు కాంగ్రెస్ శ్రేణులు బహుజన ఉద్యమకారులు అంబేద్కర్ వాదులు పెరుమాండ్ల శ్రీనివాస్, బొట్ల రాకేష్ మొదలగు వారి ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలతో శివాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్:

హనుమకొండ జిల్లా లోపీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థినులకు స్వీయ రక్షణకు సంబంధించి కరాటే, తదితర మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కార్యక్రమాల నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని డాక్టర్ పీవీ రంగారావు తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి బస చేయగా బుధవారం ఉదయం ఐదు గంటల నుండి మొదలైన విద్యార్థినుల దైనందిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులు ఉదయం వేళ వ్యాయామం, యోగా చేయగా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి కలెక్టర్ డైనింగ్ హాలులో అల్పాహారాన్ని తీసుకున్నారు. విద్యార్థినులతో కలిసి అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల వాతావరణం చాలా బాగుందని పేర్కొన్నారు. పాఠశాలలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి పాఠశాలకు, కళాశాలకు అదేవిధంగా జిల్లాకు మంచి పేరుని తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువుల్లోనూ, క్రీడల్లోనూ రాణించి మంచి పేరును తీసుకువస్తారని నమ్మకం ఉందన్నారు. పాఠశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులను సమకూర్చుతున్నట్లు తెలిపారు. స్కూల్, క్లాస్ లీడర్ విద్యార్థినులు బ్యాడ్జీలను ధరించి హుందాగా వ్యవహరిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. విద్యార్థినులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. పదో తరగతి విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు, నోట్ బుక్స్ కలెక్టర్ అందజేశారు. అనంతరం మీడియాతో కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ గురుకుల పాఠశాల కళాశాలలో 95 శాతం వరకు వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. పది రోజుల్లో మిగతా పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం కూడా పాఠశాలలో వసతులను గురించి విద్యార్థినులతో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు అడిగిన విధంగా త్వరలోనే పాఠశాలకు మిషన్ భగీరథ నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థినులకు పీఎం శ్రీ పథకంలో భాగంగా స్వీయ రక్షణ కార్యక్రమాలలో తర్ఫీదునిస్తున్నట్లు తెలిపారు. పీఎం శ్రీ పథకం కింద నిర్వహిస్తున్న స్వీయ రక్షణ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. స్వీయ రక్షణ కార్యక్రమంలో పాల్గొంటుండడం ద్వారా విద్యార్థినులలో మనోధైర్యం పెంపొందడంతోపాటు వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు. మెనూ ప్రకారం డైట్ ను అందిస్తున్నారా లేదా అని పరిశీలించినట్లు తెలిపారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వారితో మాట్లాడి అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్లో అల్పాహారం, భోజనం, సౌకర్యాలు బాగున్నాయని చెప్పారు. హాస్టల్ లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాస్మోటిక్ చార్జీలను అందిస్తున్నారా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ గురుకుల పాఠశాల పీఎం శ్రీ పథకం కింద ఉండడంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలో ఉదయం, సాయంత్రం పూటల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాల విద్యార్థినిలకు జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షల నిర్వహించి మంచి మార్కులు సాధించేలా కృషి చేయాలని ప్రిన్సిపల్, అధ్యాపకులకు సూచించారు. క్రీడలలో రాణించే విధంగా అనేక క్రీడా పరికరాలు ఉన్నాయని, అదేవిధంగా కిచెన్ గార్డెన్ బాగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సునీత రాణి, ప్రిన్సిపల్ అఫ్రీన్ సుల్తానా, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్, ఆత్మకూరు ప్రతినిధి, మధు: 

ఆత్మకూరు :- చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆత్మకూరులో ప్రముఖులు ప్రసంగించడం జరిగింది, ఉప్పునూతల శంకర్ జి మాట్లాడుతూ, శివాజీ జన్మించి 395 సంవత్సరాలు గడిచిందని శివాజీ గనుక ఉద్భవించకపోతే మన హిందూ ధర్మం ఉండకపోవు, మొగలుల దురాక్రమణలో మన హిందూ గుడిలను ధ్వంసం అవుతున్న తరుణంలో శివాజీ తన యొక్క వీరశైర్య అక్రమనచే హిందువులను రక్షించడానికి ఎంతో పాటుపడ్డాడు అని తెలిపారు, నాగబండి శివప్రసాద్ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మరియు వివేకానంద వంటి జీవిత చరిత్రను తెలుసుకొని వారి మార్గంలో జీవించాలని కోరారు, కార్యక్రమంలో వంగాల బుచ్చిరెడ్డి, ఏరుకొండ రవీందర్, టింగిలికారి సత్యనారాయణ, గంట రాహుల్ రెడ్డి, పోరెడ్డి ప్రదీప్ రెడ్డి, కందగట్ల విజయ్, ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి, ఉప్పునూతల శ్రీనివాస్, వెల్దే కపిల్, బూర కిషోర్, అల్లి మహేందర్, రేమిడి కార్తీక్ రెడ్డి, కాడబోయిన సునీల్, బలబద్ర సాయిరాం, మహిళలు పిల్లలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్ కాళేశ్వరం :- గ్రామ అభివృద్ధి కోసం సేకరించిన నిధులను సొంత అవసరాలకు వినియోగించిన ప్రబుద్ధులు ఆరేళ్ల క్రితం పూస్కుపల్లె గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం నాలుగు లక్షల నిధులను వారు గ్రామ ప్రజల నుండి వాసులు చేశారు, వసులైన డబ్బులను ఆలయానికి వినియోగించాలని నిర్ణయించుకున్నారు గ్రామస్తులు, కానీ ఈ ప్రబుద్ధులు వసులైన డబ్బులను సొంత అవసరాలకు వాడుకున్నారు, ఆరేళ్లుగా డబ్బులను ఇవ్వకుండా గ్రామంలో ఆలయన్ని నిర్మించకుండా, బేకతర్ చేస్తున్నారు, ప్రబుద్ధుల పని చూసి పూస్కుపల్లి గ్రామవాసులు, పోలీసులను ఆశ్రయించారు, గత సంవత్సరం నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసిన ఎస్సై ఇద్దరిని అరెస్టు చేశారు, కాలేశ్వరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత, భర్త మోహన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఆరుట్ల పవన్ కుమార్, ని అరెస్టు చేశామని ఎస్ఐ వివరించారు, కోర్టులో హాజరుపరిచిన పోలీసులు కస్టడి పిటిషన్, వేసే ఆలోచన ఉన్నట్టు సమాచారం టిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి మోహన్ రెడ్డి, అరెస్టు కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


                     మోహన్ రెడ్డి,    ఆరుట్ల పవన్



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


ఉమ్మడి వరంగల్:

హనుమకొండ జిల్లాలో ఆసక్తి కలిగిన విద్యార్థులు సాహస కార్యకలాపాల ( అడ్వెంచర్ ఆక్టివిటీస్ )లో పాల్గొనాలని జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలోని తొమ్మిది కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు చెందిన దాదాపు 400 మంది విద్యార్థినులకు  ఈనెల 18 నుండి 21వ తేదీ వరకు ఫోర్టు వరంగల్ లోని ఏకశిలా పార్కులో సాహస కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ అడ్వెంచర్ యాక్టివిటీస్ కింద ఐదు(కయాకింగ్, వర్టికల్ ల్యాడర్ క్లయిమ్బింగ్, సింపుల్ సౌల్యూషన్ టూ కాంప్లెక్స్ ప్రాబ్లెమ్స్, రాప్లింగ్) సాహస కార్యక్రమాలకు సంబంధించి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. 

కేజీబీవీల్లోని  9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను ఎంపిక చేసి సాహస కార్యకలాపాలలో శిక్షణను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సాహస కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థినులలో మనోధైర్యం  పెంపొందుతుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వయంగా పరిష్కరించుకునేందుకు ఇలాంటివి దోహదపడతాయని అన్నారు. తొలి రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేజీబీవీ ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు కు చెందిన 79 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. అడ్వెంచర్ యాక్టివిటీస్  ట్రైనర్  అన్విత సాహస కృత్యాలను విద్యార్ధినులకు శిక్షణనిచ్చారు. ఈ సాహస కార్యకలాపాలలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో సునీత, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, విద్యార్థినులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


ఉమ్మడి వరంగల్ :

ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వ కార్యక్రమాల పై రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య, వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. త్రాగు నీటి సరఫరా, రబీ పంటలకు సాగు నీరు , డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలు పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు. విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి నెలలో వచ్చిన అత్యధిక విద్యుత్ డిమాండ్ 15 వేల 623 మెగా వాట్లు ప్రస్తుతం ఫిబ్రవరి మాసంలోనే వస్తుందని అన్నారు. 17 వేల మెగా వాట్ల పీక్ డిమాండ్ వచ్చిన సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయని సీఎస్ తెలిపారు. వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగాలని, అవసరమైన మేర విద్యుత్తు అందుబాటులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి లోటు రావడానికి వీలు లేదని సిఎస్ పేర్కొన్నారు. 

సబ్ స్టేషన్ వారిగా అదనపు విద్యుత్ పంపిణీ తట్టుకునేలా నూతన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ ల ఏర్పాటు పనులను ఫిబ్రవరి నెల వరకు పూర్తవుతున్నాయని సీఎస్ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంశంలో స్థానికంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని, డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని సి.ఎస్ కలెక్టర్లకు సూచించారు. ఫీడర్ల వద్ద సమస్యతో గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర య్యాయని,ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి తెలియజేయాలన్నారు. మిషన్ భగీరథ, పట్టణాలలో అమృత్ క్రింద చేపట్టిన త్రాగు నీటి స్కీం, ఇతర త్రాగు నీటి స్కీంలకు, ఆసుపత్రులకు, వ్యవసాయ ఫీడర్లకు నిరంతరాయ సరఫరా ఉండే విధంగా ప్రత్యేకంగా పరిరక్షించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని సబ్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేస్తూ, అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని సి ఎస్ అన్నారు. రైతు భరోసా పై సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతులకు ఎకరానికి 12 వేల రూపాయలు చొప్పున పెట్టుబడే సహాయం అందిందని, 63% పట్టాదారులు సహాయం పోందారని అన్నారు. ప్రజా పాలన గ్రామ సభలలో కొన్ని సర్వే నెంబర్ లలో కొంత మేర సాగు భూమి వ్యవసాయెతర భూమి గా నమోదైందని తమ దృష్టికి తీసుకుని వచ్చారని, నేడు వాటిని సరి చేసే అవకాశం రైతు భరోసా పోర్టల్ లో అందించామని అన్నారు. రైతు భరోసా పోర్టర్ లో మిగిలిన వ్యవసాయ భూముల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు 5 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. రైతు భరోసా పై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆ మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిఎస్ పేర్కొన్నారు. యాసంగి పంటకు అవసరమైన ఎరువులు సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయని, జిల్లాలలో ప్రతి మండలంలో అవసరమైన ఎరువుల స్టాక్ ఉండే విధంగా కలెక్టర్ పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే సంప్రదించాలని, ఎక్కడైనా ప్యాక్ (పి.ఎ.సి.ఎస్) దగ్గర స్టాక్ లేకపోతే వెంటనే స్టాక్ అందించేలా చూడాలని అన్నారు. యాసంగి సాగు నీటి సరఫరా పై సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఆన్, ఆఫ్ విధానంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగు నీరు రైతులకు అందాలని, ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవాలని అన్నారు. ఎస్సారెస్పీ సాగు నీరు అందే కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి రాబోయే మూడు వారాలపాటు అప్రమత్తంగా ఉంటూ పంటలు కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు.‌ వేసవి కాలంలో త్రాగునీటి సరఫరా పై సిఎస్ శాంతి కుమారి సమీక్షిస్తూ, మిషన్ భగీరథ ద్వారా 25 వేల హాబిటేషన్స్ కు త్రాగు నీటి సరఫరా చేస్తున్నామని అన్నారు. రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో రావద్దని అన్నారు. మిషన్ భగీరథ గ్రిడ్ నీటి సరఫరా కోసం సోర్స్ వద్ద అవసరమైన నీటి నిల్వలు ఉండేలా నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ ఇబ్బందులు ఉన్న గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. గతంలో ఉన్న నీటి సరఫరా స్కీములు, పంప్ సెట్ ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొవాలని అన్నారు. జిల్లాలో నీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. రేషన్ కార్డు వెరిఫికేషన్ పై సీఎస్ శాంతి కుమారి సమీక్షిస్తూ, ప్రజా పాలన అర్జీలు, గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు అన్నింటిని పరిశీలించి రేషన్ కార్డులు జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు మరొకసారి మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని సిఎస్ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ , మహబూబ్ నగర్ జిల్లాలలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాలో కొత్త కార్డుల జారీ చేయాలని అన్నారు. రేషన్ కార్డులో స్క్రూట్ ని ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని సిఎస్ తెలిపారు. జిల్లాలలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలో సంక్షేమ హాస్టల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలను నిరంతరం తనిఖీ చేస్తూ అక్కడ విద్యార్థులకు అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలలో ఎదురయ్యే అనుభవాల పై నివేదిక అందించాలని సి ఎస్ తెలిపారు.  వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య లేదని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని డివిజన్లకు ధర్మసాగర్ నుండి నీటి సరఫరాను చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 24 నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. డివిజన్లలో అదనంగా 21 నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హనుమకొండ: భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. మంగళవారం భద్రకాళి చెరువు పూడికతీత పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు, మట్టి తరలింపు, తదితర విషయాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ చెరువు పూడికతీత పనులలో భాగంగా తీసిన మట్టిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తరలింపు జరగాలన్నారు. మట్టి తరలింపునకు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతర్గత రోడ్డు( అప్రోచ్ రోడ్డు)ను నిర్మించాలని సూచించారు. మట్టి తరలింపు సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. పనులు జరుగుతున్న చోట్ల రాత్రి వేళలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. మట్టి తరలించే వాహనాల నమోదు కోసం జంక్షన్, చెక్ పోస్ట్ ను ఏర్పాటుచేసి రెవెన్యూ, పోలీస్, సాగునీటి పారుదల, మున్సిపల్ శాఖల సిబ్బందితో 24 గంటల పాటు పర్యవేక్షణ, తనిఖీ ఉండేటట్టు చూసుకోవాలన్నారు. పూడికతీత మట్టి కావాలనుకునేవారు క్యూబిక్ మీటర్ కు రూ. 72 చెల్లించి తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, మున్సిపల్, కుడా, సాగునీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


 హనుమకొండ: 

ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సమ్మిళిత విద్య సమన్వయకర్త సుదర్శన్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశాల మేరకు డీఈవో వాసంతి సూచనతో జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ లోని ఏకశిలా కాన్సెప్ట్ హైస్కూల్ లో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి పాఠశాల విద్యార్థులతో కూడిన ప్రహరి క్లబ్ ను ఏర్పాటు చేశారు. ప్రహరీ క్లబ్ లో పాఠశాలకు చెందిన 6 నుండి పదో తరగతి వరకు విద్యార్థులతో కూడిన విద్యార్థుల బృందంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎవరూ కూడా మత్తు పదార్థాలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. మత్తు పదార్థాలతో అనేక దుష్ఫలితాలు కలుగుతాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించినా ఆ సమాచారాన్ని ప్రహరీ క్లబ్ విద్యార్థులకు, సంబంధిత ఉపాధ్యాయులకు సమాచారం అందించినట్లయితే సంబంధిత గ్రామ పోలీస్ అధికారికి తెలియజేస్తారన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. శారీరక మానసిక వికాసానికి దోహదపడే క్రీడలను బాల్య దశ నుంచే అలవర్చుకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుందన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల చేత డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య రవికుమార్ విద్యార్థులలో ప్రేరణ కల్పించే విధంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

నేరాల నియంత్రణ కోసం పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి, పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో విచారణ, స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై ఎస్పి గారు సమీక్ష జరిపి, కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నేర స్థల పరిశీలన, సాక్ష్యాధారాల సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు సంబంధించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అధికారులంతా విజిబుల్ పోలీసింగ్ కి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ సందర్శనలు , పట్టణంలో వార్డుల సందర్శనలు పెంచాలన్నారు. స్థానికంగా వుండే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని, మహిళల పట్ల నేరాలపై వేగంగా స్పందించి, న్యాయం చేయాలన్నారు. వివిధ దొంగతనాల కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పి తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేసిన ఎస్పి , పలు ప్రమాదాలు జరిగిన చోటును హాట్ స్పాట్ గా గుర్తించి, వాటికీ గల కారణాలను తెలుసుకుని, అవసరమైతే ఇతర శాఖల సమన్వయం తో సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పి వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు వర్టికల్ డిఎస్పి నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం, ధన్వాడ గ్రామంలో 50 కి పైన తాటి చెట్లు రోడ్డు వెడల్పులో తొలగించడం జరిగింది, గీత కార్మికుల యొక్క జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది, తమాషా చూస్తూ ఉన్న ఎక్సైజ్ శాఖ, తాటి చెట్ల తో వారి జీవన ఉపాధి కోల్పోయామని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు వెడల్పు బాగానే వదిలేసి తాటి చెట్లు నాటామని వచ్చే సంవత్సరంలో ప్రతి ఒక్క చెట్టు ఉపాధి పొందచ్చని అనుకునే క్రమంలో కావాలని చెట్లను తొలగించారని తొలగించిన వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వమే ఆదుకోవాలని, గౌడ సంఘ నాయకులు కోరుతున్నారు, 
ఈ కార్యక్రమంలో
ధన్వాడ గౌడ సంఘం ప్రెసిడెంట్ చిట్టూరి రాజలింగం, గౌడ్ సంఘం వైస్ ప్రెసిడెంట్ మార్క రవీందర్, గౌడ్ మాజీ ప్రెసిడెంట్ మారగొని రాజబాబు, గౌడ్ చీకట్ల స్వామి, గౌడ్ మారగోని తిరుపతి గౌడ్, మారగొని గణపతి గౌడ్, చీకట్ల రాజు గౌడ్, భీముని సత్యం గౌడ్, మారగోని కార్తీక్ గౌడ్, బడిగ వెంకన్న గౌడ్, మాదాస్ అంజయ్య గౌడ్, పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీ న్యూస్, ఆత్మకూర్ ప్రతినిధి, మధు

ఆత్మకూరు మండలంలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి  మాట్లాడుతూ వికసిత్ భారత్ కు జై కొట్టిన ఢిల్లీ ప్రజలు అప్ పార్టీని చీపురుతో సహా ఉడ్చేసిన ఢిల్లీ ఓటర్లు

తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ పాలనను చూసి గుండు సున్నా  కే పరిమితం చేసి చీకొట్టిన ఢిల్లీ మేధావులు మరియు ఓటరు మహాశయులకు ధన్యవాదాలు.

ఢిల్లీ అయినా గల్లీ అయినా బిజెపి తోనే మనమంతా. మన నరేంద్ర మోడీ గారితోనే మేమంతా అని చాటిన ప్రజలకు కృతజ్ఞతలు. మండల కేంద్రంలో పాత బస్టాండ్ సెంటర్ లో ఈరోజు ఢిల్లీ ఫలితాలలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలలో ముందజలో వుండి ఢిల్లీ పీఠం కైవసం చేసుకొన్న సందర్బంగా మండల బిజెపి శ్రేణులు స్థానిక ప్రజలకు మిఠాయిలు పంచుతూ, బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. 

తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు

 ఏ ఎన్నికల్లో నైనా భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు 

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, గురజాల శ్రీరామ్ రెడ్డి, కిసాన్ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు గట్టు వేణు, దామెర అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, బలవంతుల రాజు, మరియు బూత్ అధ్యక్షులు బత్తిని వీరస్వామి, మాదిరెడ్డి సురేందర్, బూర రామనాథం, పాయిరాల రాజేందర్, పీసాల సాంబయ్య, టెంకురాల రామారావు, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,