ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండ లోని చారిత్రక వేయిస్తంబాల గుడిని హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ శుక్రవారం సందర్శించారు. ఆలయ సందర్శనకు వచ్చిన యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ కు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయంలో రుద్రేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు పూలమాల,శాలువలతో యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ ను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఫోర్ట్ వరంగల్ ను సందర్శించారు. యూఎస్ కాన్సుల్ జనరల్ వెంట పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: