ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ,మార్చ్ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని, రేపటి నుంచి ప్రశ్నాపత్రాలు స్ట్రాంగ్ రూమ్ లో నుంచి పోలీస్ స్టేషన్లకు చేరుతాయని అన్నారు.
ప్రశ్నాపత్రాలు తరలింపు పోలీసు బందోబస్తు మధ్య ఉంటుందని అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాలు జిల్లాలో జరిగాయని, అవసరమైన మేర ఫ్లయింగ్ స్క్వార్డులను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. పరీక్షలు నిర్వహించి సంబంధిత జవాబు పత్రాలు పోస్టల్ ద్వారా పంపే వరకు వరకు జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉండాలని, సండే పంపు లోపల జిరాక్స్ షాపులను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులను పూర్తిగా చెక్ చేసి లోపలికి
అనుమతించాలని ఎటువంటి కాపీయింగ్ కు పరీక్ష కేంద్రాల్లో అవకాశం ఉండవద్దని సీఎస్ తెలిపారు.
పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకుని రావడానికి వీలు లేదని సిఎస్ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన త్రాగు నీరు, విద్యుత్ సరఫరా ఉండాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులు నడపాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ పై సమీక్షిస్తూ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్ - 2020 క్రింద 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత సెప్టెంబర్ 2024 లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని దరఖాస్తుల క్రమబద్ధీకరణ మాత్రమే జరిగిందని అన్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఎల్ఆర్ఎస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుము చెల్లించి క్రమబద్దికరణ చేసుకోవచ్చని తెలిపారు. లక్షా 90 వేల వరకు ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఆమోదించే వాటికి మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుము లో 25% మినహాయింపు ఉంటుందని సమాచారం అందించామని అన్నారు. ఆగస్టు 26, 2020 వరకు 10% ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లను క్రమబద్ధికరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, సబ్ రిజిస్టర్ ద్వారా నిర్ణయిత నమూనాలో నూతన దరఖాస్తులు సేకరించి ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు. క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమ బద్దీకరణ చేసుకోవాలని, మార్చి 31 వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోపాల్, ఆర్డీవో రాథోడ్ రమేష్ సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: