నేరాల నియంత్రణ కోసం పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి, పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో విచారణ, స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై ఎస్పి గారు సమీక్ష జరిపి, కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నేర స్థల పరిశీలన, సాక్ష్యాధారాల సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు సంబంధించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అధికారులంతా విజిబుల్ పోలీసింగ్ కి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ సందర్శనలు , పట్టణంలో వార్డుల సందర్శనలు పెంచాలన్నారు. స్థానికంగా వుండే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని, మహిళల పట్ల నేరాలపై వేగంగా స్పందించి, న్యాయం చేయాలన్నారు. వివిధ దొంగతనాల కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పి తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేసిన ఎస్పి , పలు ప్రమాదాలు జరిగిన చోటును హాట్ స్పాట్ గా గుర్తించి, వాటికీ గల కారణాలను తెలుసుకుని, అవసరమైతే ఇతర శాఖల సమన్వయం తో సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పి వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు వర్టికల్ డిఎస్పి నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
Post A Comment: