ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్:
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై 24 జిల్లాల కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా పెట్టాలని ఆయన సూచించారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడుల నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులకు తెలిపారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని, పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు తనిఖీ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, అక్కడ సీసీ కెమెరాలు లేదా నిరంతరాయంగా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్రతి పోలింగ్ బృందానికి అవసరమైన మేర పోలింగ్ సామాగ్రి, పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, పోస్టల్ బాక్స్ అoదేవిధంగా చూడాలని, వీటి తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు అందించాలని ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని , ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను జాగ్రత్తగా రిసెప్షన్ కేంద్రాలకు తీసుకొని రావాలని, పోలీస్ భద్రతతో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అందుకు సంబంధించిన ప్రాథమిక సౌకర్యాలు కల్పనలో భాగంగా త్రాగునీరు మరియు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతిభద్రతల పరిరక్షణ గాను పోలీస్ శాఖచే తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పాసులు జారీ చేయడం జరిగిందని, రెండు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మరొకమారు ప్రాథమిక సౌకర్యాల మరియు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లను సిబ్బందిచే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా పోలింగ్ బాక్స్ తరలించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: