పెద్దపల్లి,గోదావరిఖని,జనవరి,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ),ముస్త్యాల ప్రభుత్వపాఠశాలలో76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీపాదరావు స్మారాకార్డం ఆదివారం పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,ముస్త్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందజేసిన రామగుండం ఏసిపి జాని నరసింహులు,ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు.పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి సుందిల్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు(టిఫిన్ బాక్సులు)అందజేసిన రామగుండం ఏసీపీ జాని నరసింహులు,అనంతరం వారు మాట్లాడారు,నేను ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని పట్టుదలతో చదువుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నేనే ఒక ఉదాహరణ అంటూ ఏసీపీ చెప్పారు,ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు,విద్య బోధకులు(టీచర్స్) ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి దోహదపడాలని,తల్లిదండ్రులు కూడా మంచి మార్గంలో నడిపించాలని.కుటుంబానికి,గురువులకు,దేశానికి మంచి పేరు తీసుకురావాలని,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసిన ఒక గొప్ప రాజ్యాంగం ద్వారా కులమత భేదాలకు అతీతంగా విద్య,వైద్యం,ఉద్యోగాలు,ఓటు హక్కు,ప్రతిదీ మనం పొందుతున్నామంటే అది మహనీయుల త్యాగమని,ప్రతి ఒక్కరు గుర్తుంచు కోవాలన్నారు.ఈ కార్యక్రమం నిర్వహించిన సుందిళ్ల సురేష్ ను అభినందించిన ఏసీపీ.ఈ కార్యక్రమంలో రామగిరి మండల కన్వీనర్ మహేశ్వర రావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగాం బుచ్చిబాబు,పాపిరెడ్డి,మల్లారెడ్డి విజేందర్ రెడ్డి,యాదగిరి,సుందిళ్ల కృష్ణ,గుర్రం నరేష్,కుమార్,సుంకరి పోతరాజు,గట్టయ్య,ముస్కుల నరేందర్ రెడ్డి,గర్రెపల్లి ప్రవీణ్ గౌడ్,కోరుకోప్పుల సత్యం గౌడ్,మణికంఠ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: