పెద్దపల్లి:గోదావరిఖని:నవంబర్:1:23:(మేడిగడ్డటీవీన్యూస్.ఛానల్):పెద్దపల్లి జిల్లా:గోదావరిఖని పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణస్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్,రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్,తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణలు హాజరై ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన కార్యవర్గంతోపాటు మహిళా కార్యవర్గంచే బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడరు ఏదైనా సాధించవచ్చునని,సంఘం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని సూచించారు.సంఘం పట్టణ అధ్యక్షులుగా వెనిశెట్టి నటరాజ్ శేఖర్,ప్రధాన కార్యదర్శిగా మోతిపాటి ఆనంద్ బాబు,కోశాధికారిగా చిట్టి మల్ల కిషోర్,మహిళా సంఘం అధ్యక్షురాలుగా డాక్టర్ టి.లక్ష్మివాణి,ప్రధాన కార్యదర్శిగా గందె శ్రీభవాని,కోశాధికారి గాదె స్రవంతితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్,సింగరేణి ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్,కార్పొరేటర్స్ బాలరాజు,సోమవరపు లావణ్య,నాయకులు సోమారపు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు...

Post A Comment: