మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రజాసం్షేమం అంటే పేదల గుడిసేలు పీకడమెనా ,ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ వేల్పుల కుమారస్వామి, ఎన్టీపీసీ లోని పి కె రామయ్య కాలనీ,ఇందిరమ్మ కాలనీ భూ పోరాట కేంద్రాలను ప్రజా సంఘాలపోరాట వేదిక కన్వీనర్ వేల్పుల కుమారస్వామి,సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రామాచారి సందర్శించి మాట్లాడుతూ కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమినీ స్వాధీనం చేసుకుని ఇండ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గత మూడు నెలలుగ గుడిసెలు వేసుకొని, నిరీక్షిస్తున్న ప్రజల గుడిసెలు తొలగించడం దుర్మార్గ మైన చర్య అని అన్నారు.ఇందిరమ్మ కాలనీ ఏరియాలో స.నం.610,612,617 లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే రెవిన్యూ అధికారులు సోద్యం చూస్తున్నారని ,పిర్యాదు చేసిన స్పందించని తహశీల్దార్ పెదాలపై ప్రతాపం చూపడం సరికాదని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం G.O 58 నీ సవరించి ఇండ్లు లేని పేదలకు 125 గజాల స్థలం కేటాయించి ,ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు,ఇండ్ల స్థలాలు, పట్టా లు ఇచ్చే వరకు భూ పోరాటం ఆగదని ,ప్రభుత్వ o ఇచ్చిన హామీలు నెరవేరక పోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.ఇండ్ల స్థలాల సాధన కోసం ఈ నెల 19 రాష్ట్ర వ్యాప్తంా మండల రెవెన్యూ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు 4 భూ పోరాట కేంద్రాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పుల కుమారస్వామి, ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి,కొంటు సాగర్,వి. నాగ మని, సి హెచ్ ఉపేందర్,రమణ,కృష్ష్ణ,సుజాత,భాగ్య, సాయి మాధవి, వినయ్, సంపత్, కరుణ,స్వప్న,సరిత ,పుష్ప అలివేలుమంగ,తిరుపతి, సి హెచ్.ఓదెలు,పాల్గొన్నారు
Post A Comment: