మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ దూప తీర్చిన ఆపర భగీరధుడు సిఎం కేసీఆర్ .. దేశం గర్వించేలా మిషన్ భగీరధ పధకం రూపోందించి ప్రతి ఇంటికి శుద్ది చేసిన త్రాగునీరు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం... ప్రభుత్వం సరఫరా చేసే మిషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి గొప్ప వరమని, శుద్ధి చేసిన నాణ్యమైన నదీ జలాలను ప్రభుత్వం ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం అంతర్గాం ముర్మురులోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ళ పండుగ దినోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ తో కలిసి పాల్గొన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీటి సరఫరా అందడంపై రూపొందించిన వీడియో, ముర్మురు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా శుద్ది చేసిన నీటి సరఫరా అనుసరించే విధానం పై రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ ... గతంలో త్రాగునీటి కోసం బోరింగులు, బావుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులకు గురయ్యామని, నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్ధి చేసిన గోదావరి, కృష్ణ నది జలాలు అందించాలని ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనిని పూర్తి చేయడంలో అధికారులు, సిబ్బంది పోషించిన పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో అనేక అవరోథాలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ఇంటింటికీ త్రాగునీరు సరఫరా చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకటి మయం అవుతుందని శాపాలు పెట్టిన వారు ఆశ్చర్య పోయే విధంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఇంటింటికి త్రాగునీరు అందిస్తుందని అన్నారు. గతంలో వేసవి కాలంలో గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తే ఖాళీ బిందెల ప్రదర్శనలు , నిరసనలు ఉండేవని, నేడు వాటిని పూర్తి స్థాయిలో తొలగించా మని, ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ సమయంలో చిన్న, చిన్న ఇబ్బందులు వస్తే దానిని భూతద్దంలో చూపే వారు గత దుర్భర పరిస్థితులను గుర్తుంచుకోవాలని అన్నారు.
అంతకు ముందు జిల్లాలో ప్రజాప్రతినిధులు, పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు ముర్మురు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సందర్శింపజేసి నీటి శుద్ధి చేసే ప్రక్రియ వివరించడం జరిగింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రాంగణంలో ఎమ్మేల్యేలు, జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, అంతర్గాం ఎంపిపీ దుర్గం విజయ జెడ్పిటిసి ఆముల నారాయణ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారి కె. పూర్ణచందర్, మిషన్ భగీరథ అధికారులు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫణింద్ర, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: