మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




టీపీసీసీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా  స్థానిక 23వ డివిజన్ మేడిపల్లి సెంటర్లో నాయకులు  తంగల్లపెళ్లి ప్రకాష్, మరీదు మురళీ కృష్ణ, ముచ్చకుర్తి రమేష్ ఆధ్వర్యంలో, ఎన్టీపీసీ టౌన్ అధ్యక్షడు ఆసిఫ్ పాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కా న్ సింగ్ రాజ్ ఠాకూర్  హాజరై, వ్యాపారస్తులను, ప్రతీ గడపలోని ప్రజలని ఆప్యాయంగా పలకరిస్తూ  పాదయాత్ర చేస్తూ, మాట్లాడుతూ,

 ఈ బి ఆర్ ఎస్ & బి జె పి ప్రభుత్వాల నిరంకుశ పాలన వైఖరిని ప్రజలకు వివరిస్తూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, హామీలైన 500 /-రూపాయలకే గ్యాస్, రైతులకు ఏకకాలంలో 2,00,000 /- లక్షలు రుణ మాఫీ, కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు 5,00,000/- లక్షలు, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, అలాగే నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు పేదల బతుకులు మార్చే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు.

  అలాగే స్థానిక ఎమ్మెల్యే తమ అనుచరులతో వ్యక్తిగత పనులపై పెట్టిన శ్రద్ద,  రైతుల వడ్లు కొనుగోలు చేయాలనే ధ్యాస లేకుండా పోయిందని, దాదాపుగా 2  నెలలు గడస్తున్నా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు కూడా డబ్బులు జమకాకపోవడమే కాక , అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం కూడా ఇప్పించాలనే సోయికూడా లేకపోవడంతో ఈ మధ్యన దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాల కోసం నిర్వహిస్తున్న తరుణంలో పాలకుర్తి గ్రామంలోని రైతులు ఎమ్మేల్యే గారిని నిలదీశారని గుర్తు చేస్తూ,

స్థానిక 23వ డివిజన్ కార్పొరేటర్ దివగంత దాసరి సావిత్రి గారి హయాంలోనే అభివృద్ది జరిగిందని, వారు చనిపోయి నేటికీ మూడేళ్లు కావస్తున్న అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, కనీసం ఉప ఎన్నికలు కూడా నిర్వహించలేని ఈ అసమర్థ ఎమ్మేల్యే పాలనకు చరమగీతం పాడాలని ప్రజలందరినీ కోరారు..

అదేవిదంగా దేశానికి వెలుగులు అందిస్తున్న ఎన్ టి పి సి లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో మరియు కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్ల 2018 అగ్రిమెంట్ ను దాదాపుగా నాలుగేండ్లు గడుస్తున్నా, 18సార్లు చర్చలు జరిగినా కూడా పూర్తి స్థాయి అగ్రిమెంట్ అమలు కాకపోవడమనేది ఇక్కడి శాసనసభ్యుడు అసమర్థ, నిర్లక్ష్య పాలనకు అద్దం పడుతుందని అన్నారు..

కాంగ్రెస్ పార్టీ హయంలోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ది జరుగుతుందని, దాదాపుగా 25 సంవత్సారాలుగా రామగుండం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ, నా శక్తి మేర సహాయసహకారాలు అందిస్తుస్తున్నని, రానున్న ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే అధికారికంగా సేవ చేసే అవకాశం వస్తుందని, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరారు...

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికీ చేరవేసేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేసి రామగుండంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మహంకాళీ స్వామి, ఎండీ ముస్తఫా, గాధం విజయా, మడిపెల్లి మల్లేష్, రమేష్ ,కళ్యాణ్ ,కనుక రాజు మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ నస్రీన్ బేగం, రషీద్ ,పప్పి,గౌస్ బాబా, లంబు కిషన్ రెడ్డి, కళ్యాణ్, ఈదునూరి రవి, కంక రాజు, ఉప్పుల్ల సురేష్, ప్రసాద రావు, హరి, సాయి, రాకేష్, శంకరమ్మ, స్వప్న, పాషా, మోయిన్, ధూళికట్ట సతీష్, నజీమ్, కౌటం సతీష్, సిరిశెట్టి సతీష్, విజయ్, రంజిత్, శిరిపురం ఎంపీటీసీ మెక్కేరా సీను, మహేష్,  ,సింగం కిరణ్ గౌడ్, లతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: