మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఇటివల హైదరాబాద్ లోని చిక్కడపల్లి లో బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగు వెలుగు ఉగాది మహానంది జాతీయ పురస్కార గ్రహీత పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్దులపూర్ గ్రామానికి చెందిన దార మొండయ్య(మధు)పి పి ఏల్(ప్రోగ్రేస్సివ్ పేరెంట్స్)లీగ్ ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి గత కొంత కాలంగా సామాజిక సేవా రంగంలో పని చేస్తున్న సందర్భంగా మహానంది అవార్డు ను ముఖ్యఅతిథులు డాక్టర్ వంగాల శాంతి కృష్ణ చేతులా మీదుగా ఈ నెల 2 న అందుకున్నారు.ఈ సంద్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ జమిల్ హుస్సేన్ 

మాట్లాడుతూ దార మధు కొంత కాలంగా నిరుపేద విద్యార్థిని విధ్యార్థులను గురుకులాల్లో చేర్పిస్తు వారికి గురుకులాల్లో నాణ్యమైన విద్యకు తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ సూచించిన " పే బ్యాక్ " చేస్తూ నిరుపేదల కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నానంటూ సామాజిక బాధ్యత తో సేవ కార్య్రమాలు చేయడాన్ని గుర్తించిన తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ముందుండి గురుకుల విద్యార్థులకు,తల్లిదండ్రులకు దిశ నిర్దేశం చేస్తూ మెరుగైన భవిష్యత్తుకై బాటలు వేస్తున్న మధును అభినందిస్తు శుభాకాంక్షలు తెలిపారు.సేవా కార్యక్రమాల్లో ముందుండే ప్రతి ఒక్కరికి తప్పక గుర్తింపు వస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొండ్ర అంజయ్య యాదవ్,కార్యనిర్వణకార్యదర్శి కల్వవల అనిల్ కుమార్,కోశాధికారి కండె రవీందర్,క్లబ్ ఇంచార్జి వెన్నెల శ్రీనివాస్,సభ్యులు వివేక్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: