మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఎన్టీపీసీ జ్యోతి నగర్,,ప్రజలు జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది -cpm రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు S.వీరయ్య .     2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఇండ్ల స్థలాల పోరాట కేంద్రాన్ని సందర్శించ డానికి రాష్ట్ర కార్యద్శివర్గ సభ్యులు S.వీరయ్య,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకర్యదర్శి వెంకట్ రాములు, ఐద్వా రాష్ట్ర నాయకులు అరునాజ్యోతి,హాజరై ప్రసంగించారు.వీరయ్య గారు మాట్లాడుతూ,  ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం  ఇండ్లు కట్టిస్తామని హమీ చ్చినతెలంగాణ ప్రభుత్వం హామీ నెరవేర్చలేదు,కాబట్టే ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేపట్టామని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే రెవెన్యూ అధికారులు పోలీసులు,పీకేస్తున్నారని,అదే ప్రభుత్వ భూమికబ్జా చేసుకొని ఇండ్లు నిర్మించుకుంటే రెవెన్యూ అధికారులకు ,పోలీసులకు కనబడడం లేదన్నారు.రాజ్యాంగం లోని సెక్షన్ 21(A) ప్రజలకు జీవించే హక్కుకల్పించిందని,కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం కూడా 2022 మార్చి 31 వరకు  ఇండ్లు లేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మోడి ప్రభుత్వం కూడా హామీలు నెరవేర్చలేదని అన్నారు స్థలాలు వచ్చేవరకు పోరాటం కొనసాగించాలని రాష్ట్రప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి 5లక్షలు,కేంద్రప్రభుత్వం 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,న్యాయ ఈ పోరాటానికి అన్నివిధాల సీపీఎం రాష్ట్ర కమిటీ అండగా ఉంటుందని అన్నారు,నాయకులు మాట్లాడుతూ,ఇండ్ల జాగ వచ్చే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు.ప్రభుత్వం స్పందించి ఇండ్ల స్తలలు కేటాయించి పట్టాలు ఇవ్వాలి అని అన్నారు.స్థానిక కార్పొరేటర్ రమణారెడ్డి ప్రసంగిస్తూ మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి Y. యకయ్య ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి,ఎం.రామాచారి, ఎ.మహేశ్వరి,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షలు T.రాజారెడ్డి,సీఐటీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గిట్ల ముకుంద రెడ్డి,2వ డివిజన్ కార్యదర్శిగిట్లలక్ష్మారెడ్డి,నాయకులు p.నాగలక్ష్మి,ch. ఉపేందర్,రమణ కాదాసి  మల్లేష్, ఎం సాంబయ్యటీ.రవీందర్,నాగమణి,సురేష్ దేవిభాగ్య,ఓదెలు,లక్ష్మినారాయణ,పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: