మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం 22వ డివిజన్ అయోధ్య నగర్ కాలనీలో 66 కెవి హై టెన్షన్ విద్యుత్ లైన్ గత 22 సంవత్సరాలుగా ఇండ్ల మధ్యలో ఉండటం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి తను కార్పొరేటర్ గా గెలిచినప్పటి నుండి విద్యుత్ అధికారులతో పలుమార్లు మాట్లాడడం ధర్నా చేయడం వివిధ రకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 22వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కౌశిక లత పట్టిన పట్టు విడవకుండా అధికారుల చుట్టూ తిరిగారు ఎట్టకేలకు విద్యుత్ అధికారులు స్పందించి అయోధ్య నగర్ లో ఇండ్ల మధ్యలో నుంచి ఇళ్ల పైనుండి ప్రజలకు ఇబ్బందిగా మారిన విద్యుత్ లైన్లను ఈరోజు తొలగించడం జరిగింది. ఇంత గొప్ప పని చేసిన కౌశిక లత కు కాలనీ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు వారి వెంట మాజీ ఎంపీపీ ముంజ మల్ల గౌడ్ డాక్టర్ ముస్తఫా మద్దికుంట శంకర్ కుక్క గంగ ప్రసాద్ నిమ్మరాజుల రవి పూర్ణచందర్ కన్నమోహన్ తదితరులు ఉన్నారు..

Post A Comment: