మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సింగరేణి గని కార్మికుడు... నాడు పోలీస్ కాల్పులకు బలైన.. అమరుడు పుట్ట నారాయణ కుటుంబంను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు,సోదరుడు పుట్ట రాజన్న కోరారు. సింగరేణి బొగ్గు బాయిల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రామగుండం శాసనసభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరు కంటి చందర్ సారధ్యంలో చేపట్టిన మహాధర్న సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు  వినతి పత్రం అందజేసి వేడుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట నారాయణ కుటుంబ సభ్యులు, సోదరుడు రాజన్న మాట్లాడురు,, రామగిరి మండలం ముస్త్యాలగ్రామానికి చెందిన పుట్ట నారాయణ గోదావరిఖనిలోని సింగరేణి జిడికే -6 వ గనిలో కోల్ పిల్లర్ గా పనిచేస్తున్న తరుణంలో 5-4-1978 సంవత్సరంలో హైదరాబాదులో రమీజాబి సంఘటనతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్న సమయంలో గోదావరిఖని చౌరస్తాలో పోలీసులు మోహరించి కర్ఫ్యూ విధించగా,అప్పటికే సింగరేణి బొగ్గు బాయిలో విధులు ముగించుకొని ఇంటికి తన సైకిల్ పై తిరిగి వస్తున్న పుట్ట నారాయణ అన్యాయంగా పోలీసులు జరిపిన కాల్పులలో తూటాలకు బలై మృతి చెందాడని గుర్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం పుట్ట నారాయణ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకుందని,అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి,మంత్రులను ఎన్నోసార్లు కలిసి వేడుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.నారాయణ మృతితో అతనిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబం అంతా ఒక్కసారిగా రోడ్డున పడిందని,అప్పటినుంచి ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూనే రోజులు వెళ్ళదీస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి పుట్ట నారాయణ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంకానీ,5 ఎకరాల వ్యవసాయ భూమి గానీ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూడాలని మంత్రికి విన్నవించారు. నారాయణ కుటుంబంలో అన్ని విధాలుగా ఆదుకోవాలని వేడుకున్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: