మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో ఇటీవల విడుదలై ప్రజలందరి గుండెల్లో గూడు కట్టుకున్న సినిమా బలగం సినిమా ఉచిత ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ అంతరించిపోతున్న మానవతా విలువలను గుర్తు చేస్తూ మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేపథ్యంలో ఐక్యమత్యమే మహాబలం అని అదే బలగమని నిరూపించిన సినిమా ప్రదర్శన ఉచితంగా చేపట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని సందర్భంగా పెండ్యాల మహేష్ ని అభినందించారు పెద్దంపేట గ్రామ అక్కలు చెల్లెలు అమ్మలు గడప గడప నుండి తండోపతండాలుగా తరలివచ్చి సుమారు 1000 మంది సినిమా చూస్తుండగా వారితో పాటే కూర్చొని బలగం సినిమా చూస్తా ఉంటే మీరంతా నా బలగం అని ఇంత మంచి చక్కటి అవకాశాన్ని కల్పించిన పెండ్యాల మహేష్ ను మరొకసారి అభినందిస్తున్నారని తెలియజేశారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ మరీదు మురళీకృష్ణ గౌడ్ మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్ బీసీ సెల్ మండల అధ్యక్షులు బరపటి శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా నాయకులు ఇందారం సాయి ఉప్పుల సురేష్ హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పాసి శ్రీనివాస్ సింగం కిరణ్ బైరి కిరణ్ కరాటే మాస్టర్ సురేష్ పెద్దంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్ గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షులు పల్లె రవీందర్ పెద్దంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తమ్మనవేని కుమార్ కోటి ఉప్పుల వెంకటేష్, బీరెల్లి ప్రశాంత్ బైరి సురేష్ పెద్దల రమేష్ పైడిపల్లి ప్రసాద్ గౌడ్ పెండ్యాల విజయ్ పెండ్యాల సాగర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పెండ్యాల శ్రీనివాస్ బబ్లు ముక్కెర రాజు అధిక సంఖ్యలో పెద్దంపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు... 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: