రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లక్షలాది మంది విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర మంత్రి కేటీఆర్.నెలకు నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం రాక్షస ఆనందం పొందుతున్న తెరాస ప్రభుత్వం
రాష్ట్రంలో జరుగుతున్న ప్రశ్న పత్రాలు
వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం . మంత్రుల వైఫల్యం. విద్యాశాఖ వైఫల్యం. వీరి వైఫల్యాలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందున . అర్ధరాత్రి బండి సంజయ్ ఇంట్లో చొరబడి అక్రమంగా అరెస్టు చేయడం. అత్యంత హేయమైన చర్య. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బిజెపి రాష్ట్ర నాయకులు సోమరపు సత్యనారాయణ నాయకత్వంలో అంతర్గం మండల శాఖ తరపున ప్రభుత్వంపై పోరాడుతున్నందున అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ప్రజాస్వామ్యం పై గొడ్డలి పెట్టుగా అభివర్ణిస్తున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన. విద్యార్థుల. విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన. నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రాణాలకు తెగించి పోరాడుతుందని. 1200 మంది ఆత్మ బలిదానాల ఉసురు ఈ ప్రభుత్వానికి తాకుతుందని. రాబోయే రోజుల్లో తెరాస ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని. భారతీయ జనతా పార్టీ అంతర్గం మండల శాఖ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాం... అరెస్ట్ అయిన వారి లో బీజేపీ అంతర్గం మండల అధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, బొడ కుంట సుభాష్, దుర్గం రామకృష్ణ, తమ్మనవెని మల్లేష్, మాడ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు...

Post A Comment: