చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్రకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరునియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య సంఘీభావం తెలిపారు. చెన్నూరు నియోజకవర్గం, జైపూర్ మండలం, గంగినపల్లి గ్రామానికి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బీర్ల అయిలయ్య సంఘీభావం తెలిపారు. భట్టి విక్రమార్కతో కలిసి అడుగులో
అడుగులు వేస్తూ పాదయాత్రలో కదం తొక్కారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఏ ప్రాంతంలోనైనా బిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకత ఉందని తెలిపారు. బట్టి విక్రమార్క చేస్తున్న
పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కేసీఆర్ చేస్తున్న మోసలను ఈ పాదయాత్ర లో బట్టి విక్రమార్క ప్రజలకు వివరిస్తున్నట్లు బీర్ల అయిలయ్య తెలిపారు

Post A Comment: