మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అమరుడు పుట్ట నారాయణ 45 వర్ధంతి*.... ఆ"గని" "పుట్టె"డు శోకం..." *ఖాకీ"తూటాలకు చెదిరిన "పుట్ట" గూడు...! *కాల్పులకు బలైన సింగరేణి గని కార్మికుడు *నాలుగు దిశాబ్దాలుగా జరగని న్యాయం. *రేపు 45వ వర్ధంతి.... *ఖాకీ తుపాకి తూటాలకు-5-4-1978 న.బాలైన"ఖని" ముస్త్యాల గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు. పుట్ట నారాయణ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అయినా పట్టించుకునే నాధుడే లేడా..? "29 మార్చి 1978 : హైదరాబాదు మహానగరం లోని నల్లకుంట పోలీసులు రమేజాభిపై అత్యాచారం చేసి ఆమె భర్తను హత్య చేసిన ఘటన యావత్ రాష్ట్ర మంతా సంచలనం సృష్టించింది... ప్రజలంతా అట్టుడికిపోయారు..". "5 ఏప్రిల్ 1978: హైదరాబాద్ నల్లకుంట పోలీసుల దాష్టికాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపు... కార్మిక క్షేత్రం గోదావరిఖని ప్రాంతంలో (ఘర్షణ-వాతావరణం)అల్లర్లు... ఆందోళనలు... ప్రజలు గుమిగూడారు.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో జనం రెచ్చిపోయారు. అనుమతి లేకుండా పోలీసులు కాల్పులు జరిపారు, ఆ "ఖాకీ"తూటాలకు 23 ఏళ్ల సింగరేణి గని కార్మికుడు మరణించాడు.."అతని మరణంతో ఆ కుటుంబం చిన్నభిన్నమైంది... ఆదుకుంటామన్న ఆనాటి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మరిచిపోయింది, నాలుగు దిశాబ్దాలు గడిచిన ఆ కుటుంబం నేటికీ న్యాయపోరాటం చేస్తున్నది. అయినా ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు సింగరేణి యజమాన్యం కొలువు ఇవ్వలేదు.. పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన సింగరేణి కార్మికుడు పుట్ట నారాయణ. గోదావరిఖని సమీపములోని కమాన్ పూర్ మండల్ ముస్త్యాల గ్రామానికి చెందిన వాడు పుట్ట ఆగమ్మ-లక్ష్మయ్య దంపతుల కుమారుడు (మధ్యవాడు) ఈ నారాయణ,ఆర్ జీ 1లోని జీడీకే 6 వ గనిలో కోల్ పిల్లర్గా పనిచేసేవాడు,నారాయణ మరణంతో పారిశ్రామిక ప్రాంతంలో అప్పట్లో ఉద్రిక్తతగా మారింది. అమాయకుడిని పొట్టన పెట్టుకున్నారని పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో ప్రభుత్వం సింగరేణి యజమాన్యం కూడా నారాయణ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.నష్టపరిహారం.ఇస్తామని హామీ ఇచ్చింది, ఆ తర్వాత అందరూ మర్చిపోయినారు. ఆ ఉద్యోగం సంగతి అలాగే ఉండిపోయింది. అదే క్రమంలో 1990 నుంచి ఆ కుటుంబం న్యాయపోరాటం చేపట్టింది. కలవని మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు లేరు... సింగరేణి సీఎండీలకు కూడా విన్నవించుకున్నారు. కాల్లారిగేలా తిరిగారు... కలిసిన వారందరి కాళ్ళ మీద పడ్డారు... వేడుకున్నారు, *ఆ కుటుంబంలో ఉద్యోగం వస్తుందని ఆశతోనే నారాయణ తల్లిదండ్రులు లక్ష్మయ్య- ఆగమ్మలు ఎదురు చూస్తూనే 2008 లో కాలం చెల్లారు ఇలా నాలుగు దశాబ్దాలు గడిచిన,పరిహారం అందలేదు... ఉద్యోగం దరిచేరలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యమైతదని ఈ 8 ఏళ్ల నుండి ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి వేసారిన..పట్టించుకునే నాధుడే కరువైనాడు..?. **రేపు వర్ధంతి.. *పోలీస్ తూటాలకు బలైన "ఖని"గని కార్మికుడు పుట్ట నారాయణ 45వ వర్ధంతి,అందరూ ఆహ్వానితులే ఈ వర్ధంతి సభలు పాల్గొని అతని ఆత్మకు శాంతి చేకూర్చగలరని విజ్ఞప్తి.. బుధవారం 5-4-2023 నాడు స్నేహ సాహితీ గ్రంథాలయం సిద్ధార్థ హైస్కూల్ దగ్గర, మార్కండేయకాలనీ,గణేష్ నగర్,గోదావరిఖనిలో నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు పుట్ట రాజన్న తెలిపారు...

Post A Comment: