మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
10వ తరగతి పరీక్షా పత్రాలు, మొన్నటి టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలు లీకేజీ బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడగా మారి, లక్షలాది
మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమైపోయింది. లీకేజీలకు ప్రధాన సుత్రదారులు, పాత్రదారులు ఎవరో నిగ్గు తేల్చడానికి సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. మొత్తం
తీవ్రమైన ఈ సమస్యను ప్రక్కదారి పట్టి, రాజకీయ క్రీడ, పోలీస్ క్రిమినల్ కేసులు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోరాటంగా మారడం శోచనీయం.
బండి సంజయ్ రాజకీయ క్రీడ, రాజకీయ అవకాశవాదం, ఈ లీకేజీల వ్యవహారాన్ని రక్తికట్టించింది. ప్రభుత్వం, బీజేపీ అసలు సూత్రదారులు ఎవరో అర్థం కాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చూపిస్తుంటే, ప్రభుత్వం బండి సంజయిని, బీజేపీని బాధ్యులుగా చూపిస్తున్నారు. అసలు సూత్రదారులు, పాత్రదారుల గురించి నిరుద్యోగులకు తెరమరుగు చేస్తున్నారు.
ఈ రాజకీయ క్రీడను ఆవి, లక్షలాది మంది జీవితాలతో ఆటలాడుకుంటున్న, రాజకీయ నాయకులు లక్షలాది మంది తల్లి దండ్రులను టెన్షన్కు గురి చేస్తున్న ఈ లీకేజీల మూలాన్ని స్పష్టంగా కనిపెట్టాలి. ఈ పరిణామాల వలన దోషులు, బాద్యులు తప్పించుకో కూడదు. దీని వెనుకు ఎంతటి వారున్న కఠినంగా శిక్షించాలి. మొత్తం ఈ వ్యవహారం పారదర్శకంగా జరగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

Post A Comment: