మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో ఎన్టిపిసి మేడిపల్లి, అన్నపూర్ణ కాలనీలో గల అంబేద్కర్ భవనంలో *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్*హాజరై ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు *మారేడు మోహన్ ఆదేశానుసారము ఎన్టిపిసి అన్నపూర్ణ కాలనీ చెందిన *తగురం రాజేందర్ ను పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక ఉత్తరువు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *భుషిపాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ...
మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగజీవన్ రావు, ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని, జిల్లాలోని ప్రతి గడపగడపకు సంస్థను చేరవేసి బలోపేతానికి కృషి చేయాలని, బడుగు బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా కష్టంలో ముందుండి పని చేయాలని అన్నారు..
*ఎస్సిఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు తగురం రాజేందర్ మాట్లాడుతూ నా నియమకానికి కృషి చేసినటువంటి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ కు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూష్పక సంతోషి మహారాజ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దపెల్లి జిల్లాలో బడుగు బలహీన వర్గాల ఆశయసాధన కోసము పనిచెస్తనని, నన్ను నమ్మి నాకు బాధ్యత ఇచ్చినందుకు నా శ్వాయసక్తుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంస్థను బలోపేతం చేసే దిశగా పెద్దపల్లి జిల్లాలో కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి జిల్లా నాయకులు *ఇదునూరి అశోక్ రాజేశం, రవి తదితరులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Post A Comment: