మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలంలోని గోలివాడ గ్రామానికి సంబంధించి 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునివ్వగా ఎంతో మంది దరఖాస్తు చేసుకోగా వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి అందులో నుండి డ్రా పద్ధతి ద్వారా 20 మందిని ఎంపిక చేసి వారికి ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఇల్లు కేటాయించకపోవడంతో గత వారం రోజులుగా మండల కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద శాంతియుత వాతావరణం లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఈరోజు బాదిత కుటుంబాలతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన అనంతరంజిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ గతంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపికైన అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాతే వేరే వాళ్లకు ఇవ్వాలని రామగుండం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తెరాస ప్రభుత్వం మీద ఉందని స్థానిక శాసనసభ్యులకు మూడంతస్తుల బిల్డింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన గౌరవ కేటీఆర్  ఈ బాధితులకు కూడా ఇల్లు కట్టించే విషయంలో బాధ్యత తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు*అనంతరం *మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ గ్రామ సభ ద్వారా ఎంపిక చేసిన బాధితులకు ఇల్లు ఇవ్వకుండా ఫైల్ దొరుకుతలేదు  అని సంబంధిత అధికారుల నుండి ఎటువంటి సమాచారం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని ఇట్టి విషయంలో  జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రతినిధులు అందరు కూడా దృష్టి సారించి అర్హులైన వారికి డబల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్ బీసీ సెల్ జిల్లా నాయకులు ఇందారం సాయి సాటేపూరి రాకేష్*మరియు *సామాజిక కార్యకర్త పల్లె శ్రీనివాస్

*బాధిత కుటుంబాలకు సంబంధించిన బొడ్డు రమేష్ దొంతుల క్రాంతి కుమార్ సామల రమేష్సిరిపురం లత కౌటం సరిత బండారి శ్రీలత జక్కుల మల్లేశ్వరి సోకల్ల వాణి తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: