మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గుడిసెలు పీకేస్తే భూపోరాటం ఆగుతుందా , సిపిఎం ఎన్టిపిసి రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి.    ఇళ్లస్థలాల కోసం జరుగుతున్న పోరాటం నెలరోజులు దాటింది , నిలువ నీడ కోసం  గుడిసెలు వేసుకోవడం ప్రారంభించారు ఈ సందర్భంగా హాజరైన సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి మాట్లాడుతూ, గత ఫిబ్రవరి మూడో తారీఖున తాసిల్దార్ కు  ఇళ్లస్థల కోసం సీపీఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది, రెండో డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఏరియాలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం  కాకుండా చూడాలని పోవడం జరిగింది, గత వారం రోజుల క్రితం దాదాపు 6వేలకు పైగా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది , ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దరఖాస్తు దారులు గుడిసెలు వేసుకోవడం ప్రారంభించారు, ఇది గిట్టినవారు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతోవచ్చి గుడిసెలు తొలగించడం అన్యాయమని, ఇండ్లు నిర్మించుకోవడంలేదని, ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మాత్రమే గుడిసెలు వేసుకుంటున్నామని, ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని అర్హులైన వారికి ఇళ్లస్థలా ఇచ్చేంతవరకు, ఇక్కడ్నుండి కదలలేదని  చెప్పారు, కొందరు సృష్టించి భూ పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని,అదిసాగనివ్వమని,ఇండ్ల స్థలాలు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు,ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం రామాచారి, సిహెచ్ ఉపేందర్, ఏం దేవేంద్ర, రమణ, భాగ్య, సుజాత, స్వప్న, మహాలక్ష్మి, సిహెచ్ ఓదెలు, పాల్గొన్నారు ( ఎం రామాచారి సిపిఎం పార్టీ  ఎన్ టి పి సి రామగుండం ఏరియా కార్యదర్శి...... 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: