మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ జ్యోతి నగర్, సామాజిక, ఆర్థిక పోరాటాలను ముందుకు తీసుకెళ్లడమే బి టి ఆర్ కు నిజమైన నివాళి ,. సిఐటియూ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదీవే 33వ వర్ధంతి సందర్భంగా ఎన్టిపిసి సీఐటీయూ ఆఫీసులో BTR చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడంజరిగింది ఈ సందర్భంగా జిల్లా కోశాధికారిఎం రామాచారి మాట్లాడుతూ, సిద్ధాంతకర్త, రచయిత, వక్త అయిన BTR స్వాతంత్ర పోరాటంలో స్వతంత్ర అనంతరం కూడా కార్మిక వర్గ ఐక్యతకు ఎనలేని కృషి చేశారని, కార్మిక సంఘాలన్నీ కార్మిక సమస్యలపై ఐక్య పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని పరితపించేవాడని, ఐక్యత పోరాటం నినాదం ఆచరనలో పోయిందని , అందుకు దేశ అనేక సమ్మెలే ఉదాహరణలని , వారి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, సామాజిక ఆర్థిక పోరాటాలను బలోపితం చేయడమే వారికి ఇచ్చే నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏం రామాచారి జి లక్ష్మారెడ్డి కాదాసి మల్లేష్,V. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Post A Comment: