మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రలో( for Change) భాగంగా రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 34 & 33వ డివిజన్ అధ్యక్షులు ఎర్ర మధు, దొంతుల లింగం గార్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని, గడపగడపలోని ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారితో మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ & సిలిండర్ ధరలను పెంచి, వాటిపై అదనంగా జీఎస్టీ పన్నులు విధిస్తూ, చిన్న, మధ్య తరగతి వ్యాపారుల బతుకులు చిన్నా భిన్నం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ను కేవలం 500రూపాయలకే అందించడంతో పాటు, సొంత జాగా ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5లక్షల రూపాయలు అందిస్తామని తెలిపారు.గతంలో డ్రా ద్వారా ఎంపికైన లబ్దిదారులకే మొదటగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాకే, అర్హులైన మిగతా లబ్దిదారులకు కేటాయించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పరికరాలను ప్రభుత్వము నుండే నేరుగా కొనుగోలు చేయాలే తప్ప మధ్యవర్తుల ద్వారా చేయకూడదని, ఇక్కడి శాసనసభ్యుడి
అండదండలతోనే ఈ వ్యవహారమంతా జరుగుతుందని గోదావరిఖని అంతా కోడైకూస్తుందని, ఇప్పటికైనా ఇలాంటి అవినీతి పనులు మానుకొని ప్రజలకు ఉయోగపడే పనులు చేయాలని స్థానిక ఎమ్మెల్యేకు హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. కావున మీరందరూ
రానున్న రోజుల్లో కాంగ్రెస్
పార్టీనీ ఆశీర్వదించాలని ప్రజనుద్దేశించి అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర ఛైర్మెన్ ఎండీ ముస్తఫా, సీనియర్ నాయకులు బొంతల లచ్చన్న, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్, పాతపెల్లి రవి చుక్కల శ్రీనివాస్, పాతిపెల్లి రవికుమార్, పెడ్డెల్లి ప్రకాష్,
బీసీ విభాగం అధ్యక్షులు గట్ల రమేష్,
ఎస్సీ సెల్ అద్యక్షులు తాల్లపెళ్లి యుగేందర్, పంజా శ్రీనివాస్, బీసీ సెల్ నాయకులు కెంగర్ల కుమార్, మారుపాక శంకర్, రత్న కొమురయ్య, అరికిల్ల నర్సయ్య, అడిచర్ల శ్రీనివాస్, ఆషాడం తిరుపతి, పాతపెళ్ళి కృష్ణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్,యువజన విభాగం నాయకులు కౌటం సతీష్, కనుకుంట్ల అశోక్,అధ్యక్షులు యాధ వెంకట రమణ, కుంట సది, నంది వెంకటేశ్, కల్వల రంజిత్, మాదరవెన కిరణ్, కొత్తపల్లి రాజు, కొక్కిరాల శ్రీనివాస్ రావు,గాధమ్ శాంతి, అష్రఫ్, అడప కృష్ణ, జడల శ్రీనివాస్, & అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Post A Comment: