ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశించారు.
బుధవారం సాయంత్రం ఆయన హన్మకొండ కలెక్టరేట్ లో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లా లకు సంబందించి జీవో నంబర్.58, 59 ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ,పలు పథకాల క్రింది కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంశాల మీద కలెక్టర్ లు , అడిషనల్ కలెక్టర్ లు, మున్సిపల్, రెవిన్యూ, సంబందించిన అధికారులతో సమీక్షించారు.
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం. గత డిసెంబర్‌లో జారీ చేసిన జీవో నంబర్.58, 59కు అనుగుణంగా.. భూముల అసైన్‌మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు ను పారదర్శకంగా చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కోరిన విధంగా ప్రతి మున్సిపాలిటీ పది అంశాలను ఖచ్చితంగా చేయాలన్నారు.
TUFIDC, పథకం క్రింద ప్రతి మునిసిపాలిటీలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఈ నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేయాలని ఆన్నారు. అమృత్, పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్, ఎస్ డి ఎఫ్, సీఎం అసురన్స్ పథకాల క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని ఆదేశించారు.
కొత్త మునిసిపల్ చట్టం ప్రకారం బడ్జెట్ లో కేటాయించిన 10 శాతం నిధులను ఖచ్చితంగా గ్రీనరీ, పట్టణ సుందరికరణ కు వినియోగించాలని అన్నారు.
పట్టణాలలో సెంట్రల్ మెడియాన్స్, ఫూట్ పాత్స్, స్ట్రీట్ లైట్స్, అంతర్గత రహదారులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుటకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. సమగ్ర వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, దోబీఘాట్స్, వైకుంఠధామం లను వేగవంతంగా పూర్తి చేయాలని, ఇంకను ప్రారంభించని యు ఎల్ బి లు త్వరగా ప్రారంభించాలని తెలిపారు.
అనంతరం అరవింద్ కుమార్
మినీ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగర మేయర్ గుండు సుధారాణి హన్మకొండ, వరంగల్* కలెక్టర్లు సిక్తా పట్నాయక్, డాక్టర్ గోపి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య,లతో కలసి మంచినీటి సరఫరా, ఫ్లడ్ యాక్షన్, ప్లాన్, మినీ స్టేడియాల ఏర్పాటు, కాళోజీ కళా క్షేత్రం, వరంగల్, బస్ స్టేషన్ ల నవీకరణ, స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా నగరంలోని 66 డివిజన్లలో వచ్చే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ మహా నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించాలని అన్నారు. నీటి సరఫరా లో ఎదురయ్యే సాంకేతికపరమైన సమస్యలను అధ్యయన చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని నీటి సరఫరా లో నిపుణులైన వరంగల్ కు నియమించిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డ్ విశ్రాంత ఆపరేషన్ డైరెక్టర్ రవికుమార్ ను ఆదేశించారు. మహానగరంలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా ప్రతి రోజు జరిగేలా నిపుణుల సహకారంతో చర్యలు చేపట్టాలని అన్నారు. వాల్వ్ లు, లికేజ్ లు , పైపులైన్లు, తక్కువ ప్రెషర్ గల ప్రాంతాలు, తగినంత నీటి సరఫరా జరగని ప్రాంతాలను గుర్తించి నీటి సమస్యను అధిగమించాలన్నారు.
వరద నివారణ కార్యాచరణ ప్రణాళికపై సమీక్షిస్తూ నగరంలో వరద గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పునరావృత్తమ్ కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రాధాన్యత క్రమంలో స్వల్పకాలిక దీర్ఘకాలిక పనులను చేపట్టాలన్నారు. భద్రకాళి చెరువుకు ఒకటే sluice లను ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. అవసరమున్నచోట డక్ట్ లను నిర్మించాలని, ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైన పనులను యుద్ధప్రాతిపదికన చేయాలని అన్నారు. నాలలలో డిసిల్ట్ చేయాలని, 5 ఫ్లోటింగ్ ట్రాష్ మెషిన్ లు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.
వరంగల్ గ్రేటర్ పరిధిలో గల నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క మినీ స్టేడియం చోప్పున ఏర్పాటు చేయాలన్నారు.
కాళోజి కళాక్షేత్రం నిర్మాణ
పనుల్లో వేగం పెంచి జూన్ 2 వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు.
వరంగల్ బస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్న మాదిరిగానే హనంకొండ బస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా ఆర్టీసీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ సిటీ లో చేపట్టిన 62 పనుల్లో ఇప్పటికి 26 పనులు ప్రురయ్యాయని, మిగిలిన వివిధ పురోగ దశలలో ఉన్న 36 పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో మహబూబాద్, వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, అశ్విని తానాజీ వాకిడే, శ్రీవత్స కోట, దివాకర, స్నేహలత, మధుసూదన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, ఆర్డీవోలు వాసు చంద్ర, రాము, మహేందర్ జి , మునిసిపల్, రెవిన్యూ, పబ్లిక్ హెల్త్ అధికారులు,
16 మునిసిపాలిటీల కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: