ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

పకడ్బందీ ప్రణాళికతో మనస్ఫూర్తిగా, భక్తిభావంతో విధులు నిర్వర్తించి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 నుంచి 24 వ తేదీ వరకు  శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హల్ నందు ఏర్పాట్లపై  ఆయన  ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, సీపీ రంగనాధ్  కలెక్టర్ సిక్త పట్నాయక్, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్యతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ  సందర్బంగా ఆయన  మాట్లాడుతూ వేయి స్తంబాలు గుడి, మెట్టు  గుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో  స్వామివారలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా లోపాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. భక్తులకు సాఫీగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ ఏడాది  వేయిస్తంబాల దేవాలయం తో పాటు మెట్టుగుట్ట ఆలయం లలో లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.  ప్రధానంగా క్యూలైన్లు, లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం, తాగునీరు, శానిటైజేషన్‌, పార్కింగ్‌, ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలని,  మెట్టు గుట్ట వద్ద గత ఈతగాళ్లను నియమించాలని సూచించారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వసతి కల్పించాలని, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని, క్షేత్రానికి వచ్చి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు.

కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేసే క్రమంలో ఏమైనా తేడాలు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు.  సంబంధిత ప్రభుత్వ శాఖలు తమ శాఖకు సంబంధించిన బాధ్యుల వివరాలను వెంటనే ఆలయ అధికారులకు అందజేయాలన్నారు.  మహాశివరాత్రి జరిగే పట్టణంలో సానిటేషన్‌ను పకడ్బందీగా చేపట్టే విధంగా 24 గంటలు పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలని అన్నారు.  జాతరలో నిరంతర వైద్య సేవలు అందించేందుకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పని చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. భద్రకాళి ఆలయం మాడ  వీధుల నిర్మాణ లను  వేగవంతం చేయాలనీ  అన్నారు. ఎండోమెంట్ కార్యాలయం ను కలెక్టరేట్ కు తరలించడానికి  తగిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  డిఆర్ఓ వాసు చంద్ర, కూడా పిఓ అజిత్ రెడ్డి, భద్రకాళి దేవస్థానం ఈవో శేషు భారతి, ప్రధాన అర్చకులు  భద్రకాళి శేషు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: