ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  కృషి ఫలించింది. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి, పక్క గ్రామాలైన వల్మీడి, బమ్మెర లు ఎంతో చారిత్రాత్మకమైన ప్రాంతాలు, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం కెసిఆర్  దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులతో టూరిజం కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నారు. కారిడార్ కేంద్రంగా ఉన్న పాలకుర్తిలో ఒక టూరిజం హోటల్ ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  సంకల్పించారు. సీఎం కెసిఆర్  దృష్టికి తీసుకెళ్లగా, వారు తక్షణమే స్పందించి టూరిజం హోటల్ నిర్మాణానికి 25 కోట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా పరిపాలన అనుమతి ఇస్తూనే, 25 కోట్లు నిధులు మంజూరు చేస్తూ, సాధ్యమైనంత త్వరగా ఆ భవనాన్ని నిర్మించాలని ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం 48 జీఓ ను విడుదల చేసింది. 

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  మాట్లాడుతూ పాలకుర్తిలో టూరిజం హోటల్ ఏర్పాటు చేయాలని కోరగానే నిధులు మంజూరు చేసిన సీఎం కెసిఆర్ కి, మంత్రి కెటిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఇక్కడ హోటల్ నిర్మాణం అయితే, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పాలకుర్తి  కి వచ్చే టూరిస్టులు, భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు పాలకుర్తిలో బస చేయడానికి వీలు కలుగుతుందని మంత్రి చెప్పారు. పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి టూరిజం హోటల్ ఎంతగానో ఉపయోగ పడుతుందని , ఈ హోటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కి, కేటీఆర్ కి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి మంత్రి మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: