ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

వరంగల్ మహానగరంలో  కొనసాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ భాస్కర్,  రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమారులు అధికారులను ఆదేశించారు.

గురువారం హనుమకొండ కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో  డబుల్ బెడ్ రూమ్,  వరంగల్ హనుమకొండ  బస్ స్టేషన్ల నవీకరణ, కాళోజీ కళాక్షేత్రం, స్మార్ట్ సిటీ కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లష్కర్ సింగారంలో ఆర్ అండ్ బి శాఖ ద్వారా చేపట్టనున్న రెండు పడక గదుల పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ ద్వారా లష్కర్ సింగారంలో కొనసాగుతున్న డెక్ట్ అండ్ డ్రెయిన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.  వరంగల్ మోడల్ బస్ స్టేషన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయబడినందున వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. వరంగల్ మాదిరిగానే హనుమకొండ బస్ స్టేషన్ కూడా నవీకరించుటకు గాను ఆర్టీసీ అధికారులతో చర్చించి డి పి ఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రం పనులు పనులలో వేగం పెంచి జూన్ 2 కల్లా పూర్తవ్వాలన్నారు. .

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నిర్దేశ గడువులోగా పూర్తి చేయాలన్నారు.  నగరంలోని పలు ప్రాంతాల్లో సెంట్రల్ మీడియం,  అంతర్గత రోడ్ల అభివృద్ధి జంక్షన్లో సుందరీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు.

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,  జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ ప్రావీణ్య డిఆర్ఓ  వాసుచంద్ర, కుడా పిఓ అజిత్ రెడ్డి, ఎంఆర్వో రాజ్ కుమార్, కుడా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: