మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పేదోళ్ల గుండెల్లో కొలువైన దేవుడు సీఎం కేసీఆర్
పేద యువతుల వివాహాలకు అర్ధిక భరోసా కళ్యాణ లక్ష్మి పధకం రామగుండం ప్రజల చిరకాలం ఉపయెాగపడేలా మెడికల్ కళాశాల రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల గుండెల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువై ఉన్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి
రైతు వేదికలో 31 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల తో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజహిత సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ విజయవంతంగా అమలు చేస్తూ
పేదవాళ్ల కన్నీళ్లు తుడస్తున్న
దేవుడు కేసీఆర్ అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు బారంగా కావద్దనీ భావించి ఎంతో గొప్పగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారన్నారు. పేదింటి యువతి వివాహానికి మేనమామ కట్నంగా కెసిఆర్ ఒక లక్ష 116 రూపాయలను అందిస్తూ వారికి ఆర్థిక భరోసా కనిపిస్తున్నరని అన్నారు. ప్రజలకు చిరకాలంగా గుర్తుండే విధంగా వారికి ఉపయోగపడే విధంగా రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో మెడికల్ కళాశా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. పేద ప్రజలు అంతా ఈ మెడికల్ కళాశాలలో ఉచితంగా వైద్యాన్ని పొందవచ్చునని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మనకోసం మన సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు మరువద్దని సందర్భం వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు అండగా నిలవాలని ఆయన రుణం తీర్చుకోవాలనిఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు. సొంత స్దలం కలిగి ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రుపాయలు అందించండం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం ఎంపీపీ
దుర్గం విజయ జెడ్పిటిసి అముల నారాయణ సర్పంచులు
బండారి ప్రవీణ్ ధరణి రాజేష్ స్వామి తుంగపిండి సతీష్ గుమ్ముల రవీందర్ ధర్మాజీ కృష్ణ మెరుగు పోశం గంగధరి దేవమ్మ రాములు ఎంపీటీసీలు మస్కం శ్రీనివాస్ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి కో-ఆప్షన్ సభ్యులు దివాకర్ గౌస్ పాషా బి.ఆర్ .ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ నాయకులు కుర్ర నూకరాజు గంగాధరి రాములు అలీ గణేష్ ఎలుక కొమురయ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు...!

Post A Comment: