మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఇటీవల గోదావరిఖని న్యూ అశోక్ థియేటర్ సమీపంలో చెత్త తీస్తుండగా కరెంట్ షాక్ గురైన రామగుండం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుడు సందీప్ హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. యువ పారిశుద్ధ్య కార్మికుడు మరణానికి విద్యుత్ శాఖ అధికారులు, రామగుండం నగరపాలక సంస్థ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం.11కేవీ హై టెన్షన్ వైర్ తెగడం అనేది పూర్తిగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే జరిగింది. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి విద్యుత్ శాఖ లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగం తో పాటు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
పారిశుద్ధ్య కార్మికుల పట్ల రామగుండం నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. సరి అయిన రక్షణ చర్యలు తీసుకోకుండా కార్మికులకు ఇవ్వాల్సిన గ్లౌజులు ఇతర రక్షణ పరికరాలు ఇవ్వకుండా వ్యవహరించడం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మూలంగా కార్మికుడి ప్రాణం పోయింది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు, ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించాలని వారికి అన్ని రకాల రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం..

Post A Comment: