ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సామాన్యుడు పోలీస్టేషన్ కు వెళితే న్యాయం జరిగేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పనిచేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పి వారి సమస్యలను ఓపిగ్గా విని, ఫిర్యాదిదారుల సమస్యలపై విచారణ జరిపి చట్ట పరంగా పరిష్కరించాలని, సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి ప్రజా దివాస్ కార్యక్రమంలో భూమి, కుటుంబ, ఆర్థిక, గొడవలు, చీటింగ్ కు సంబంధించిన పలు ఫిర్యాదులు వచ్చాయి.

Post A Comment: