మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గత ఐదు రోజుల క్రితం గోదావరిఖని న్యూ అశోక థియేటర్ సమీపంలో తన విధులు నిర్వర్తించే క్రమంలో భాగంగా ఆయిళ్ళ సందీప్ అనే పారిశుద్ధ కార్మికుడు చెత్త తీస్తుండగా అక్కడే పడివున్న కరెంట్ వైరు తగలి కరేంట్ షాక్ తో పడిపోవడంతో సందీప్ ను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు నిన్న రాత్రి మృతి చెందడం జరిగింది.
సందీప్ మరణానికి నగరపాలక సంస్థ మరియు విద్యుత్ శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలని మృతి చెందిన కార్మికుని కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషీయా తో పాటు కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని *సోమారపు లావణ్య అరుణ్ కుమార్*డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సందీప్ కుటుంబాన్ని వారు పరామర్శించి అనంతరం వారు మాట్లాడుతూ
పారిశుద్ధ్య కార్మికుల పట్ల రామగుండం నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని అదికార్ల పర్యవేక్షణ లేకపోవడం అలాగే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా కార్మికులకు పనులు అప్పగిస్తున్నారని తర్వాత ఏం జరిగినా వారిని చూసుకునే నాధుడే లేడని అనేక సందర్భాలలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలాంటి ప్రమాదాల నుండి పారిశుద్ధ్య కార్మికులను రక్షించేందుకు రామగుండం నగరపాలక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వకుండా కార్మికులను పనులకు పంపిస్తు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆరోపించారు. వారి వెంట మాతంగి రేణుక, శ్రీనివాస్, కిషోర్, శ్రీకాంత్ ఉన్నారు.

Post A Comment: