మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
శ్రీ సరస్వతీ శిశుమందిర్ జవహర్ నగర్ పాఠశాల జనవరి 26న వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమంతో పునః ప్రారంభమైంది. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడానికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి పనులు నడుస్తున్నాయి. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అనే నానుడిని నిజం చేస్తు పట్టణంలోని వివిధ వర్గాల వారు ఇతోధికంగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు అనగా సోమవారం రోజున అంజనీ పుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ లక్ష రూపాయలు విలువచేసే 16 సీలింగ్ ఫ్యాన్లు, 3 ప్రొజెక్టర్ లు అందించారు. ప్రబంధకారిణి అధ్యక్షురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ లకు లక్ష రూపాయల చెక్కును పాఠశాల అవరణలో అందించారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర ఎస్టేట్స్ డైరెక్టర్ తిరుపతి గౌడ్, విద్యాపీఠం జిల్లా సహకార్యదర్శి శ్రీనివాస్, ప్రబంధకారిణి కార్యదర్శి గంధం రవీందర్, కోశాధికారి నలుమాసు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రబంధకారిణి సోమారపు లావణ్య అరుణ్ కుమార్ మరియు సభ్యులు గుర్రాల శ్రీధర్ తదితర దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Post A Comment: