ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మొన్న రేషన్ డీలర్ల సమస్యల గురించి అసెంబ్లీ వేదికగా మాట్లాడి రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వడం, కమిషన్ పెంచడంలో ప్రభుత్వం చొరవ చూపాలనీ డీలర్ల యొక్క విన్నపాలను అసెంబ్లిలో వినిపించినటువంటి వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలుసుకున్న రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు & జిల్లా అధ్యక్షులు దారావత్ మోహన్ నాయక్ , స్థానిక వరంగల్ మండల అధ్యక్షులు గోపన్న ఎమ్మెల్యే ని గజమాలతో సత్కరించి, ఙ్ఞాపిక అందచేయడం ద్వారా డీలర్ల అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ మండల అధ్యక్షులు మంద భారతీ రామచంద్రం (ఖిలా వరంగల్), రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతరాజు రమేశ్ , మండల అధ్యక్షులు బాబురెడ్డి(వర్ధన్నపేట), శంకర్ రావు (గీసుగొండ), వెంకటనారాయణ (నెక్కొండ), రాంనారాయణ (నర్సంపేట), ఉపేందర్ (రాయపర్తి), వివిద మండలాల కార్యదర్శులు వేణుగొపాల్ , శ్రీనివాస్ , బాస్కర్, సోమయ్య మరియు వరంగల్ & హనుమకొండ జిల్లాల డీలర్ మిత్రులు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి , అభినందించారు.

Post A Comment: