ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఒక్కరి కోసం అందరు-
అందరి కోసం ఒక్కరూ అనే గొప్ప సహకార స్పూర్తితో కల్పలత సూపర్ బజార్ ముందుకు సాగుతోంది.
కల్పలత సూపర్ బజార్ ను అభివృద్ధిని వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు కొనియాడారు.
సహకార వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తూ సహకార స్ఫూర్తితో ముందుకు సాగుతున్న కల్పలత సూపర్ బజార్ సందర్శనకు సతీసమేతంగా విచ్చేసిన వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు - మరియా దంపతులకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్వాగతం పలికి అనంతరం కల్పలత సూపర్ బజార్ సందర్శనకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన సహకార రంగం అభివృద్ధిలో భాగంగా కల్పలత సూపర్ బజార్, త్రిచక్ర సహకార పొదుపు సంఘం అభివృద్ధి కోసం వినయ భాస్కర్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించి కాసేపు సూపర్ బజార్ విధివిధానాలపై చర్చించారు. సూపర్ బజార్ ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాల మరియు భవిష్యత్తులో సూపర్ బజార్ అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను ఎమ్మెల్యే రమేష్ బాబుకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలో కల్పలత సూపర్ బజార్ ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో హనుమకొండ సూపర్ బజార్ అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు రావడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా రాణించలేకపోతున్నాయన్నారు. కానీ పట్టువిడవని సంకల్పంతో పని చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది చెప్పేందుకు ఒక మంచి ఉదాహరణ మన చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గొప్పగా ముందుకు సాగుతున్న ఈ సూపర్ బజార్ సాక్ష్యమని చెన్నమనేని అన్నారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఉమ్మడి పాలకులు నష్టాల పేరుతో సూపర్ బజార్ ఆస్తులను అమ్మాలని చూశారని,
కానీ నేడు అప్పులను ఆస్తులుగా మార్చుకుని 50 మందికి ఉపాధిని కల్పిస్తూ గొప్పగా రూపాంతరం చెందిన కల్పలత సూపర్ బజార్ నేడు పలు సహకార సంఘాలకు ఆదర్శంగా నిలవడం శుభసూచికమని చీఫ్ విప్ అన్నారు.వేములవాడలో మా ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో సూపర్ బజార్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అద్భుతమైన ప్రణాళికతో సూపర్ బజార్ ను ప్రగతి పథంలో నడిపిస్తామని ఆయన తెలిపారు.
అనంతరం చెన్నమనేని దంపతులను క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి చీఫ్ విప్ దంపతులు అతిథ్యమిచ్చారు
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, కల్పలత సూపర్ బజార్ చైర్మన్ వర్ధమాన్ జనార్దన్, మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ రావు,వైస్ చైర్మన్ షఫీ, డైరెక్టర్లు దానం, ప్రభాకర్ రెడ్డి, స్నేహాలత, స్వర్ణలత మరియు కుడా డైరెక్టర్ శివశంకర్, త్రిచక్ర ఆటో పొదుపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: