మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

కెసిఆర్  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ  అంతర్గాం మండల కేంద్రంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆద్వర్యంలో ప్రజా సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ఇండ్లు, ఫించన్లు, ధళితులకు ధళిత బందు, మూడెకరాల భూమి, కొత్త రేషన్ కార్డులు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, సాగు నీరు, త్రాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు *సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలందరూ ఇండ్లు లేక జాగలు లేక ఎలాంటి ఆధారం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించాలని కోరారు.

అలాగే దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని రైతులకు రుణమాఫీ చేయాలని వ్యవసాయానికి తగిన సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతతున్నారని రైతులు తెచ్చుకున్న అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నారని పంటలకు సాగునీరు తాగునీరు అందించి రైతులను ఆదుకోవాలన్నారు.

 రైతాంగానికి 24 గంటల కరెంటును నిరంతరాయంగా అందిస్తున్నామని ప్రచార ఆర్భాటాలు తప్ప 

కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంటు ను కోతలు లేకుండా అందించడంలో వైఫల్యం చెందిందన్నారు. 

   డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ ఎక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం కానీ కట్టిన ఇండ్లు పూర్తిగా ఇవ్వడం జరగలేదు. అలాగే కొత్త ఫించన్లు, రేషన్ కార్డుల కొరకు అనేక మంది దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్నా ఫించన్లు, రేషన్ కార్డులు నేటికీ  ఇవ్వనేలేదు. మరోసారి "కే సీ ఆర్" ప్రభుత్వం ప్రజల్ని మబ్య పెట్టి ఆశలు కల్పించే ప్రయత్నాలు చేస్తుంది.   కేసీఆర్ ప్రభుత్వం గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు.  అలాగే పెద్దంపేట్ గ్రామంలో గత 70 ఏళ్ళనుండి అక్కడి పేద రైతులు సాగు చేసుకుంటున్న ఖుర్షికమ్మి భూములకు తక్షణమే పట్టాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు.

 లేని పక్షంలో సీపీఐ(ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవల్సి వస్తుందని కె రాజన్న హెచ్చరించారు. 

 ఈ ప్రెస్ మీట్ లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్, మండల కార్యదర్శి 

కొల్లూరి మల్లేశ్, 

మండల నాయకులు వేల్పుల

సాంబయ్య , ఉప్పులేటి నర్సయ్య, బొంతు ఆనంద్, పైడిపల్లి రమేష్ , ఎస్ తిరుపతి, టిరాజకొమురయ్య,ఆరుముళ్ళ తిరుపతి, టి నవీన్, మాలెం తిరుపతి, జి లక్ష్మణ్,మాడ స్వామి తదితరులు పాల్గోన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: