మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని,  విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే పారిశుద్ధ్య కార్మికుడు అయిల్ల సందీప్ (27) మృతి చెందాడని  ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు.  మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు అయిల్ల సందీప్(27) కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు, వాస్తవ విషయాలను తెలుసుకొని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించి, రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ ను కలిసి జరిగిన విషయాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ నిర్లక్ష్య ధోరణికి సందీప్ ప్రాణం పోయిందని, సందీప్ ప్రాణం వెల ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం పూర్తిస్థాయిలో బాధితులను తప్పుదారి పట్టించే విధంగా ఉందని అన్నారు. సందీప్ మృతికి కారకులైన విద్యుత్ శాఖ సిబ్బందిపై వెంటనే శాఖాపరమైన చర్యలు చేపట్టి ఐపిసి 304/ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని , మృతుని కుటుంబానికి విద్యుత్ శాఖలో పర్మినెంట్ ఉద్యోగంతో పాటు 50 లక్షల ఎక్స్క్లేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నుండి  కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు ఐదు లక్షలు తక్షణ సహాయం కింద అందజేయాలని  కోరారు. మున్సిపాలిటీ లో పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికులందరికీ వారి వారి వీధి నిర్వహణలో భాగంగా అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మార్వాడి సుదర్శన్ , పర్యావరణ పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ మానవ హక్కుల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ మధు సభ్యులు అజయ్ కిషోర్ రంజిత్ అచ్యుత్ రాజన్న దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: