మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆశలు-ఆకాంక్షలు నెరవేర్చేందుకే పుట్టిన కారణజన్ములని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని
అంతర్గాం మండల కేంద్రంలో స్వయంబువుగా వెలసిన నూకాంబికా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశానికి ప్రధానమంత్రిగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని అర్చన చేయించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. గోలివాడ గ్రామంలో గూడులేని నిరుపేద వృద్ధురాలు రాజవ్వకు ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు కానుకగా 'గిఫ్ట్ ఏ స్మైల్' కింద ఇల్లు నిర్మించడం కోసం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వారి పాలన దేశానికే ఆదర్శమని, వారి సుపరిపాలన సంక్షేమ ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలంటే రాబోయే కాలంలో ప్రధానమంత్రి కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేయడం జరిగిందన్నారు. సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, పేదవారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే, ఆయన పుట్టిన రోజున తాను తన స్వంత ఖర్చులతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నానన్నారు.
వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయ, జడ్పిటిసి అముల నారాయణ, రాష్ట్ర కార్యదర్శి మూల విజయా రెడ్డి, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ-మహేందర్ రెడ్డి, సర్పంచులు కుర్ర వెంకటమ్మ-నూకరాజు, బాదరవేణి స్వామి, ధర్మాజీ కృష్ణ, తుంగపిండి సతీష్, బండారి ప్రవీణ్, కొల్లూరి సత్య, సతీష్, సందెల దివ్య, మల్లేష్, గంగాధర దేవమ్మ-రాములు, మెరుగు పోచం, ఎంపీటీసీ మస్కం శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షులు తిరుపతి నాయక్, ప్యాక్స్, వ్యవసాయ కమిటీల ప్రతినిధులు, మండల కో-ఆఫ్షన్ సభ్యులు గౌస్ పాషా, గ్రామాల ఉప సర్పంచులు దొరిసెట్టి సాగర్, బియ్యాల శంకరయ్య, ఉప్పులేటి శేఖర్, ఒల్లాల దివాకర్, పెరుమాళ్ళ శశి కుమార్, కనుమల్ల రాకేష్, దారవేణి సంతోష్, కూనారపు గోపి, కస్తూరి పద్మ, అంజయ్య, గ్రామ అధ్యక్షులు నక్క జితేందర్, సంతోష్, ధరణి విష్ణు, అర్షనపెళ్ళి రాజు, శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలుక కొమురయ్య, కుర్ర శ్రీనివాస్, అంతర్గాం మండల టిప్పర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: