మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అర్హత కలిగిన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని వర్తింపజేసి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్గాo తహసిల్దార్ కు సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా CPI ML ప్రజాపంధా జిల్లా నాయకులు పెండ్యాల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక్క నిరుపేదలకు కూడా ఇల్లు కేటాయించలేదు. ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని హామీ ఇచ్చి గదినెక్కిన ఎనిమిది సంవత్సరాలలో కూడా ఒక్క ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవు. నేడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తిరిగి ఓట్ల కోసం సీట్ల కోసం డబుల్ బెడ్ రూమ్ పథకానికి దరఖాస్తు చేసుకోమని ప్రకటనలు చేస్తున్నారు. అర్హత కలిగి ఉన్న నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం పథకాన్ని వర్తింపజేసి చేసి ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వృద్ధాప్య, వికలాంగ, ఒంటరి మహిళ, పెన్షన్ దరఖాస్తులు స్వీకరించాలని, మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మండలంలో రైతులందరికీ 24 గంటల విద్యుత్తును సరపరా చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ క్షేత్రస్థాయిలో మాత్రం వైపల్యం చెందింది. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక మోటార్లు కాలుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం వెంటనే రైతన్నలని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా నేతలు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, ఆడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, భూషవేణి కృష్ణ, మార్త రాములు, నస్పూరి లక్ష్మి, ఆలకుంట ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: