మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఓబి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం గోదావరిఖని 5inc వద్ద జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కౌశిక హరి, బుర్ర తిరుపతి,వేల్పుల కుమారస్వామి, ఏ.వెంకన్న ,తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ ఓబి కాంట్రాక్టు కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. చట్ట ప్రకారము వీరికి రావలసిన హైపర్ కమిటీ వేతనాలు అమలుపరచడం లేదు. గత అనేకసార్లు నోటీసులు ఇచ్చి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఓబి యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ స్థితిలో రామగుండం రీజియన్ లో ఉన్న ఓబీ కాంట్రాక్ట్ కార్మికులంతా నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి ఆరవ తేదీ నుంచి జరిగే నివేదిక సమ్మెలో ఓబి కాంట్రాక్టు కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. మార్చి 6 నుంచి జరిగే నిరవేదిక సమ్మెకు ఓబి యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి సమ్మె ప్రచారం కొనసాగించాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నిర్ణయించడం జరిగింది
Post A Comment: